Project K : ప్రాజెక్ట్ K గ్లింప్స్ రిలీజ్ టైం వచ్చేసింది.. ప్రభాస్ ఫ్యాన్స్‌కి అర్ధరాత్రి పని పడింది..

ప్రాజెక్ట్ K గ్లింప్స్ కి టైం ఫిక్స్ చేశారు. అమెరికన్ టైం ప్రకారం ఈరోజు రాత్రి 1-2 గంటల సమయంలో ఈ గ్లింప్స్ రిలీజ్ కానుంది. అయితే ఇండియన్ టైం ప్రకారం ఏ టైం అంటే..

Project K : ప్రాజెక్ట్ K గ్లింప్స్ రిలీజ్ టైం వచ్చేసింది.. ప్రభాస్ ఫ్యాన్స్‌కి అర్ధరాత్రి పని పడింది..

Prabhas Project K first glimpse release time details

Updated On : July 20, 2023 / 6:47 PM IST

Project K : మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ పతాకం పై దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో సి అశ్వినీ దత్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. సూపర్ హీరో కాన్సెప్ట్ కి ఇండియన్ మైథాలజీ టచ్ ఇస్తూ ఈ మూవీని తెరకెక్కుస్తున్నారు. కలియుగం చివరిలో ఈ సినిమా స్టోరీ మొదలు కాబోతుంది. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పఠాని వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తుంది.

Sai Rajesh : ప్రేక్ష‌కులకు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన బేబీ ద‌ర్శ‌కుడు.. ఆ ఒక్క డైలాగ్ మాత్ర‌మే..!

ఇక ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ ని అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ అండ్ కమల్ తో కలిసి చిత్ర దర్శక నిర్మాతలు ఆ ఈవెంట్ లో జాయిన్ అయ్యారు. అమెరికన్ టైం ప్రకారం ఈరోజు రాత్రి 1-2 గంటల సమయంలో ఈ గ్లింప్స్ రిలీజ్ కానుంది. ఆ ఈవెంట్ తో పాటే యూట్యూబ్ లో కూడా అదే సమయానికి రిలీజ్ చేయనున్నారు. అంటే ఇండియన్ టైం ప్రకారం రేపు జులై 21 తెల్లవారుజామున 1:30 నుండి 2:30 మధ్యలో ఈ గ్లింప్స్ రిలీజ్ అవుతుంది.

Ram Charan : ఉపాసనకి అండ్ కూతురికి వన్ మంత్ బర్త్ డే విషెస్ చెబుతూ చరణ్ ఎమోషనల్ వీడియో..

ఈ టైమింగ్స్ తో ప్రభాస్ అభిమానులకు అర్ధరాత్రి పని అపడినట్లు అయ్యింది. అయితే అభిమానులు ఈ గ్లింప్స్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుండడంతో.. ఏ టైంకి రిలీజ్ చేసిన రెడీ అంటున్నారు. కాగా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ కొంత నిరాశ పరిచింది. దీంతో గ్లింప్స్ ఎలా ఉండబోతుందో అని అందరిలో ఆసక్తి నెలకుంది. మరి ఈ ఇండియన్ సూపర్ హీరో ఎలా ఉండబోతున్నాడో చూడాలి.