Salaar : ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. సలార్ వచ్చేస్తున్నాడు.. ఆ పండక్కే రిలీజ్..
సలార్ కొత్త రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నాడట. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి. ఆ పండక్కే..

Prabhas Salaar new release date update is here
Salaar : ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘సలార్’. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నెలలోనే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. అనుకోని కారణాలు వల్ల పోస్ట్‌పోన్ అయ్యింది. దీంతో ప్రభాస్ అభిమానులంతా తీవ్ర నిరాశ చెందారు. అయితే ఈ మూవీ కొత్త విడుదల తేదీ పై చిత్ర యూనిట్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ మూవీ అసలు ఈ ఏడాదిలో వచ్చే అవకాశం లేదని, నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి వాయిదా కూడా పడవచ్చని టాక్ వినిపించింది.
Miss Shetty Mr Polishetty : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో నవీన్ పోలిశెట్టి రికార్డులు..
దీంతో రెబల్ అభిమానుల్లో ఆందోళన మొదలయింది. అయితే తాజాగా వారికీ కిక్ ఇచ్చే న్యూస్ బయటకి వచ్చింది. ఈ మూవీ ఈ ఏడాదే ఆడియన్స్ ముందుకు రాబోతుందట. ఈ మూవీ రిలీజ్ విషయం గురించి ఎగ్జిబిటర్లకు ఒక మెయిల్ వచ్చిందట. ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా రిలీజ్ కానుందని నిర్మాతలు తెలియజేశారట. ఇదే సంగతిని సెప్టెంబర్ 29న అధికారికంగా ప్రకటించి ఆడియన్స్ కి కూడా తెలియజేస్తారట నిర్మాతలు. ఈ విషయాన్ని ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
Jawan : ఆ రికార్డు సాధించిన మొదటి హీరోగా షారుఖ్ ఖాన్.. జవాన్ మూవీ..
YES, IT’S TRUE… SRK VS PRABHAS, ‘DUNKI’ VS ‘SALAAR’ THIS CHRISTMAS… The exhibitors have received a mail stating that #Salaar will arrive THIS CHRISTMAS [on 22 Dec 2023]… An official announcement by the producers, #HombaleFilms, will be made on Friday [29 Sept 2023].
This is… pic.twitter.com/BkgLGepiOt
— taran adarsh (@taran_adarsh) September 25, 2023
కాగా అదే సమయంలో షారుఖ్ ఖాన్ ‘డంకీ’ కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో పాన్ ఇండియా మార్కెట్ లో ఈసారి గట్టి పోటీ కనిపించబోతుంది. ఈ మూవీ నిర్మాతలు గతంలో నిర్మించిన కేజీఎఫ్-1.. షారుఖ్ ఖాన్ ‘జీరో’ సినిమాతో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. అప్పుడు కేజీఎఫ్ తో షారుఖ్ పై విజయం సాధించిన నిర్మాతలు.. ఇప్పుడు కూడా అది రిపీట్ చేస్తారా..? లేదా..? చూడాలి. కాగా ఈ మూవీ శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా, శ్రియారెడ్డి కీలక పాత్రను పోషించింది.