కరోనా ఎఫెక్ట్ : షాకింగ్ డెసిషన్ తీసుకున్న ప్రభాస్
కరోనా ఎఫెక్ట్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్వీయ నిర్భంధం..

కరోనా ఎఫెక్ట్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్వీయ నిర్భంధం..
గతకొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ (కోవిడ్ -19) గురించి పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలియచేస్తున్నారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కరోనా వైరస్ గురించి స్పందించాడు.
కరోనా వైరస్ విషయంలో స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోతున్నట్లుగా తన ఇన్‌స్టాగ్రమ్ ద్వారా తెలిపాడు డార్లింగ్. ఇటీవలే అబ్రాడ్ (జార్జియా)లో షూటింగ్ ముగించుకుని వచ్చిన ప్రభాస్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా స్వీయ నిర్భంధం విధించుకుంటున్నట్లుగా తెలియజేశారు. ప్రజలందరూ ఈ మహమ్మారి నుంచి సురక్షితంగా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు.
అబ్రాడ్ నుంచి ప్రత్యేక విమానంలో భారత్ చేరుకున్న ప్రభాస్ కరోనా పరిస్థితుల దృష్ట్యా 14 రోజుల పాటు ఇంటికే పరిమితం కానున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.