Spirit : ప్రభాస్ స్పిరిట్ తో.. సందీప్ రెడ్డి వంగ సినిమాటిక్ యూనివర్స్.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ వంగ బ్రో..

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు సందీప్ చెప్పాడు. (Spirit)

Spirit : ప్రభాస్ స్పిరిట్ తో.. సందీప్ రెడ్డి వంగ సినిమాటిక్ యూనివర్స్.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ వంగ బ్రో..

Spirit

Updated On : October 22, 2025 / 12:58 PM IST

Spirit : ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ లిస్ట్ లో ఉన్న సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చేస్తున్న రాజాసాబ్, ఫౌజీ సినిమాలు పూర్తయ్యాక స్పిరిట్ సినిమా మొదలు కానుంది.(Spirit)

సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసి, లొకేషన్స్ కూడా ఫైనల్ చేసి ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా స్పిరిట్ సినిమా గురించి ఓ ఆసక్తికర టాక్ నడుస్తుంది. సందీప్ రెడ్డి వంగ దీన్ని సినిమాటిక్ యూనివర్స్ లా మారుస్తాడట.

Also Read : Nara Rohith : హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్న నారా రోహిత్.. ముహూర్తం ఎప్పుడంటే..?

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు సందీప్ చెప్పాడు. ప్రభాస్ పాత్రని సెంటర్ చేసుకొని ఆ కథ చుట్టూ వేరే పాత్రలతో సినిమాటిక్ యూనివర్స్ సృష్టిస్తాడని సమాచారం. అందుకే స్పిరిట్ సినిమాలో పూర్తి ఎండింగ్ ఇవ్వకుండా ఇంకో సినిమాకి లీడ్ ఇస్తారట. స్పిరిట్ సినిమాటిక్ యూనివర్స్ అనే వార్త వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ తో సందీప్ వంగ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అని అంచనాలు పెంచుకుంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ముంబై, మెక్సికో, థాయిలాండ్ లో జరగనుంది. డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని టాక్ నడుస్తుంది. కానీ ఇది మొదలవ్వాలంటే ఫౌజీ సినిమా షూటింగ్ పూర్తవ్వాలి.

Also Read : Prabhas Hanu : 1932 నుంచి మిస్సింగ్.. ప్రభాస్ హను రాఘవపూడి సినిమా అప్డేట్.. ప్రభాస్ బర్త్ డే..