Nara Rohith : హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్న నారా రోహిత్.. ముహూర్తం ఎప్పుడంటే..?

రీసెంట్ గా సుందరకాండ, భైరవం రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు నారా రోహిత్.(Nara Rohith)

Nara Rohith : హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్న నారా రోహిత్.. ముహూర్తం ఎప్పుడంటే..?

Nara Rohith

Updated On : October 22, 2025 / 12:13 PM IST

Nara Rohith : సీఎం చంద్రబాబు నాయుడు సోదరుని తనయుడు గా నారా రోహిత్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోగా నారా రోహిత్ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినా ఇటీవల రీ ఎంట్రీలో మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యారు. రీసెంట్ గా సుందరకాండ, భైరవం రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు నారా రోహిత్.(Nara Rohith)

నారా రోహిత్ తనతో పాటు ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్ గా నటించిన శిరీషని(సిరి లేళ్ల) ప్రేమించి గత సంవత్సరం నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే నిశ్చితార్థం తర్వాత నారా రోహిత్ తండ్రి మరణించడంతో పెళ్లి వాయిదా పడింది. ఇటీవలే సిరి లేళ్ల పసుపు కొట్టి పెళ్లి పనులు మొదలుపెట్టిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also Read : Prabhas Hanu : 1932 నుంచి మిస్సింగ్.. ప్రభాస్ హను రాఘవపూడి సినిమా అప్డేట్.. ప్రభాస్ బర్త్ డే..

తాజాగా నారా రోహిత్ – శిరీష పెళ్లి పెళ్లి డేట్ వైరల్ గా మారింది. నారా రోహిత్ – శిరీష పెళ్లి నాలుగు రోజుల వేడుకగా జరగనుందని సమాచారం. వీరి పెళ్లి అక్టోబర్ 30న జరగనుంది. ఈ పెళ్ళికి సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది హాజరుకాబోతున్నారు. దీంతో కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.

 

View this post on Instagram

 

A post shared by Siree Lella (@siree_lella)

Also See : Jabardasth Kevvu Kartheek : భార్యతో కలిసి జబర్దస్త్ కెవ్వు కార్తీక్ దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా?