Suriya 42: సూర్య కోసం పాన్ ఇండియా స్టార్ వస్తున్నాడా..?

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్య42’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. తెలుగులో సూర్య 42 టైటిల్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Suriya 42: సూర్య కోసం పాన్ ఇండియా స్టార్ వస్తున్నాడా..?

Prabhas To Come For Suriya 42

Updated On : April 14, 2023 / 8:13 PM IST

Suriya 42: తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్య42’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు శివ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై తమిళనాట సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఫిక్షనల్ కథతో చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా, భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రానుంది.

Suriya 42 : సూర్య సినిమా హిందీ రైట్స్ 100 కోట్లకు అమ్ముడుపోయాయ?

ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ టైటిల్ అనౌన్స్‌మెంట్ రేపు చేయనున్నారు చిత్ర యూనిట్. ఈమేరకు రీసెంట్‌గా టైటిల్ అప్డేట్ కూడా చేశారు. అయితే ఈ సినిమాకు ఎలాంటి పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రానున్న సూర్య 42 మూవీకి సంబంధించిన టైటిల్‌ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో రివీల్ చేయించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Suriya 42: సూర్య సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రభాస్.. మోషన్ పోస్టర్ అదిరిపోయిందిగా

ఈ క్రమంలోనే తెలుగులో సూర్య 42 టైటిల్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య పాత్ర అల్టిమేట్‌గా ఉంటుందని.. అందుకే ఈ సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్‌ను లాక్ చేసినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిషా పటానీ హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాను హిందీలోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.