Prabhutva Junior Kalasala : మరో ఓటీటీలోకి వచ్చిన ఇంటర్ లవ్ స్టోరీ సినిమా..

ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా తాజాగా మరో ఓటీటీలోకి వచ్చేసింది.

Prabhutva Junior Kalasala : మరో ఓటీటీలోకి వచ్చిన ఇంటర్ లవ్ స్టోరీ సినిమా..

Prabhutva Junior Kalasala Punganuru Movie Streaming New OTT Details Here

Updated On : September 26, 2024 / 1:30 PM IST

Prabhutva Junior Kalasala : ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. బ్లాక్ యాంటీ పిక్చర్స్ బ్యానర్ పై కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

Also Read : Devara Movie : రేపే ‘దేవర’ రిలీజ్.. దేవర గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..

ఈ సినిమా జూన్ 21న థియేటర్స్ లో రిలీజయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమాలో ఇంటర్ చదివే రోజుల్లో టీనేజ్ లవ్ స్టోరీ, తొలిప్రేమ, ఆ ప్రేమలో సమస్యలు, ఫ్యామిలీ పరిస్థితులు.. ఇలాంటి పలు అంశాలతో, ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కించారు. గతంలో ఈ సినిమా తెలుగు ఓటీటీ ఆహాలోకి రాగా తాజాగా మరో ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది.

Prabhutva Junior Kalasala Punganuru Movie Streaming New OTT Details Here

ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్.. మా ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమాని థియేటర్లో చూసి సపోర్ట్ చేసినవారికి ధన్యవాదాలు. చూడని వాళ్ళు ఇంకా ఉంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది చూసేయండి అంటూ తెలిపారు. టీనేజీ లవ్ స్టోరీ చూడాలంటే ఈ సినిమా చూసేయండి.