Prabuthwa Junior Kalashala : టీనేజీ లవ్ స్టోరీ మూవీ ఓటీటీలోకి.. ఇంటర్ ప్రేమ కథలు..
ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా తొలిప్రేమ, టీనేజ్ లవ్ స్టోరీ, అప్పటి సమస్యలు, ఫ్యామిలీ పరిస్థితులు.. ఇలాంటి అంశాలతో వచ్చి ప్రేక్షకులని మెప్పించింది.

Prabuthwa Junior Kalashala Punganuru Movie Streaming in OTT Details Here
Prabuthwa Junior Kalashala : ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా తెరకెక్కిన సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. బ్లాక్ యాంటీ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాణంలో డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించారు. ఇంటర్ చదివే రోజుల్లో టీనేజ్ లవ్ స్టోరీతో ఈ సినిమాని తెరకెక్కించగా జూన్ 21న థియేటర్స్ లో రిలీజయింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా తొలిప్రేమ, టీనేజ్ లవ్ స్టోరీ, అప్పటి సమస్యలు, ఫ్యామిలీ పరిస్థితులు.. ఇలాంటి అంశాలతో వచ్చి ప్రేక్షకులని మెప్పించింది. థియేటర్స్ నుంచి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఇటీవల వరుసగా తెలుగు సినిమాలను తీసుకొస్తున్న తెలుగు ఓటీటీ ఆహాలో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. మరో వారం రోజుల్లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి కూడా రానుంది ఈ సినిమా. యూత్ లవ్ స్టోరీలు నచ్చేవాళ్ళు థియేటర్స్ లో మిస్ అయితే ఈ సినిమాని ఆహా ఓటీటీలో చూసేయండి.