Shubman Gill – Pragya Jaiswal : శుభ్‌మ‌న్ గిల్‌‌తో డేటింగ్ కి రెడీ అంటున్న టాలీవుడ్ హీరోయిన్..

శుభ్‌మ‌న్ గిల్‌‌ ఓకే అంటే అతనితో డేటింగ్ కి ఓకే అంటుంది ఈ భామ.

Shubman Gill – Pragya Jaiswal : శుభ్‌మ‌న్ గిల్‌‌తో డేటింగ్ కి రెడీ అంటున్న టాలీవుడ్ హీరోయిన్..

Pragya Jaiswal said if Shubman Gill is ok ready to relationship comments goes Viral

Updated On : November 30, 2024 / 4:15 PM IST

Shubman Gill – Pragya Jaiswal : పలువురు హీరోయిన్స్ క్రికెటర్స్ తో ప్రేమాయణం నడుపుతారని తెలిసిందే. గతంలో, ప్రస్తుతం కూడా చాలా మంది హీరోయిన్స్ క్రికెటర్స్ తో ప్రేమలో ఉన్నారు, కొంతమంది పెళ్లిళ్లు చేసుకున్నారు. తాజాగా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ క్రికెటర్ శుభ్‌మ‌న్ గిల్‌‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రగ్యా జైస్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో రిలేషన్ షిప్ తో పాటు పలువురు సెలబ్రిటీల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి.

ఇందులో హోస్ట్ శుభ్‌మ‌న్ గిల్‌‌ పేరు చెప్పడంతో.. అతను చాలా క్యూట్ గా ఉంటాడు. నేను సింగిల్ గానే ఉన్నాను. మీరేం అనుకుంటారో అనుకోండి ఇది జరిగేలా చూడండి. అది రాసి ఉంటే జరుగుతుంది. అతను క్రికెటరా కాదా అని నేను చూడను మంచి అబ్బాయి అయితే ఎవరు కాదంటారు అని చెప్పింది. దీంతో డైరెక్ట్ గానే శుభ్‌మ‌న్ గిల్‌‌ ఓకే అంటే అతనితో డేటింగ్ కి ఓకే అంటుంది ఈ భామ.

Also Read : Rashmika Mandanna : వామ్మో.. పుష్ప 2 కోసం రష్మిక అన్ని రోజులు పని చేసిందా..

అయితే ఇప్పటికే శుభ్‌మ‌న్ గిల్‌‌ సారా టెండూల్కర్, సారా అలీఖాన్ లతో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం లేదు. ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ కూడా శుభ్‌మ‌న్ గిల్‌‌ తో డేటింగ్ కు రెడీ అంటుంది. మరి దీనిపై శుభ్‌మ‌న్ గిల్‌‌ స్పందిస్తాడా చూడాలి.