Janam : ‘జనం’ సినిమా రీ రిలీజ్.. పొలిటికల్ డ్రామా..
ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు.

Pragya Naina Janam Movie Re Releasing
Janam : వీఆర్‌పీ క్రియేషన్స్ బ్యానర్ పై పి.పద్మావతి సమర్పణలో సుమన్, అజయ్ ఘోష్, కిషోర్, వెంకటరమణ, ప్రగ్య నైనా.. పలువురు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘జనం’. వెంకటరమణ పసుపులేటి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత సంవత్సరం నవంబర్ 10న థియేటర్స్ లో రిలీజయింది. ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు.
జనం సినిమా మే 29న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ.. ఉత్తమ పౌరులుగా ఉండాల్సిన నేటి తరం యువకులు స్మార్ట్‌ఫోన్‌కు, నాయకులు పంచే మందు, డబ్బులకు ఎలా బానిస అవుతున్నారో ఆలోచింపచేసేలా ఈ సినిమా తెరకెక్కించాము. ఒకప్పుడు సినిమాలు జనాన్ని ఆలోచింప చేసే విధంగా ఉండేవి. ఇప్పుడు రక్త పాతం, హింస, బీపీలు పెరిగే సౌండ్, అర్ధం లేని సినిమాలు వస్తున్నాయి. సమాజానికి, రేపటి తరానికి ఏంటి అని ఆలోచించండి. అందుకే జనం సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. ఇంకా ఓటీటీకి ప్లాన్ చేయలేదు. ఈ సినిమాకు సుమన్ గారే హీరో. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన నటించారు అని తెలిపారు.