#justasking నీ గురించి నువ్వేమనుకుంటున్నావ్ కంగనా? ప్రకాష్ రాజ్ కౌంటర్

  • Published By: sekhar ,Published On : September 12, 2020 / 03:08 PM IST
#justasking నీ గురించి నువ్వేమనుకుంటున్నావ్ కంగనా? ప్రకాష్ రాజ్ కౌంటర్

Updated On : September 12, 2020 / 6:36 PM IST

Prakash Raj counter to Kangana Ranaut: బాలీవుడ్‌ నటి, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన కంగనా రనౌత్‌ ఇప్పుడు ఏకంగా మహారాష్ట్ర సర్కారుతోనే పోరాటం చేస్తోంది. కంగనా రనౌత్‌కు కొందరు మద్దతు తెలియజేస్తుంటే.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. తాజాగా కంగనా వ్యవహార శైలిని విమర్శిస్తూ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ వ్యంగ్యాస్త్రాలను సంధించారు.



https://10tv.in/kangana-ranaut-to-uddhav-thackeray-your-ego-will-be-destroyed-just-like-my-house/
‘జస్ట్‌ ఆస్కింగ్’ #justasking అంటూ సోషల్‌ మీడియాలో ప్రశ్నించే ప్రకాష్ రాజ్‌ తనదైన శైలిలో వ్యంగ్యంగా కంగనా తీరుని తప్పుబట్టారు. ‘‘ఒక సినిమాకే కంగనా తనను రాణీ లక్ష్మీబాయ్‌ అనుకుంటే మరి ‘పద్మావత్‌’లో చేసిన దీపికా పదుకొనె, ‘జోథా అక్బర్‌’లో అక్బర్‌గా నటించిన హృతిక్‌ రోషన్, ‘అశోక’ చిత్రంలో చేసిన షారూక్‌ ఖాన్‌, ‘భగత్‌ సింగ్‌’లో నటించిన అజయ్ దేవగణ్‌, ‘మంగళ్‌ పాండే’గా నటించిన ఆమిర్‌ ఖాన్‌, ‘మోడీ’గా నటించిన వివేక్‌ ఒబెరాయ్‌ ఏమనుకోవాలి’’.. అని ప్రశ్నించేలా ఓ పోస్టర్‌ను షేర్ చేశారు ప్రకాష్ రాజ్. ఎప్పుడూ ఎదుటివారికి కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉండే కంగనా మరిప్పుడు ప్రకాష్ రాజ్‌ కౌంటర్‌కు రీకౌంటర్‌ ఇస్తోందా? లేక లైట్ తీసుకంటోందా? అనేది చూడాలి.