NTR Movie : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా షూట్ అప్పట్నుంచే.. వికారాబాద్ అడవుల్లో ప్రశాంత్ నీల్ టీమ్..

ప్రశాంత్ నీల్ కూడా ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని ఎన్టీఆర్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

NTR Movie : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా షూట్ అప్పట్నుంచే.. వికారాబాద్ అడవుల్లో ప్రశాంత్ నీల్ టీమ్..

Prasanth Neel NTR Movie Shooting Update Rumors goes Viral

Updated On : February 11, 2025 / 9:26 PM IST

NTR Movie : జూనియర్ ఎన్టీఆర్ సినిమాల లైనప్ మామూలుగా లేదు. దేవర మూవీ తర్వాత బాలీవుడ్ లో వార్-2 సినిమా చేస్తూనే ఇంకోవైపు మరిన్ని సినిమాలను లైన్ లో పెడుతున్నాడు తారక్. వార్-2 షూటింగ్ చివరి దశకు రాగానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి టచ్ లోకి వచ్చారు ఎన్టీఆర్. ఇటు ప్రశాంత్ నీల్ కూడా ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని ఎన్టీఆర్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

Also Read : Ram Charan : రామ్ చరణ్ RC16 టైటిల్ అదేనా? టైటిల్ రివీల్ ఆ రోజే..? చరణ్ రోల్ ఏంటి?

ఈ నెల 17 నుంచి తారక్ – ప్రశాంత్ నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. భారీ యాక్షన్ బ్లాక్‌లతో రూపొందే ఈ మూవీ, టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట నీల్. వికారాబాద్ అడవులు, పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ ఎపిసోడ్స్‌ను షూట్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ టీమ్ వికారాబాద్ అడవుల్లో లొకేషన్స్ కోసం రెక్కీ చేస్తున్నారు. ఈ అడవుల్లో కొన్ని ఫైట్ సీన్స్, నేచురల్ విజువల్స్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారని తెలుస్తోంది.

Also Read : Sanjay Dutt : ఏకంగా 72 కోట్ల ఆస్తి ఫేవరేట్ హీరో పేరు మీద రాసి చనిపోయిన లేడీ ఫ్యాన్.. హీరో ఏం చేసాడో తెలుసా?

అయితే ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొనడం లేదట. ఈ షూటింగ్‌లో ఎన్టీఆర్ మార్చి నెలలో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ను పెట్టాలని ఆలోచన చేస్తున్నారట మేకర్స్. ఎన్టీఆర్ గత రెండు సినిమాల్లో కూడా ఫారెస్ట్ ఎపిసోడ్స్ హైలెట్ అయ్యాయి. RRRలో కొమరం భీమ్ గా, దేవరలో కూడా అడవుల సీన్స్ బాగా కలిసొచ్చాయి. మరోసారి నీల్ తో కూడా అలాంటి బ్యాక్ డ్రాప్ తోనే వస్తున్నారు తారక్. అయితే, ఎన్టీఆర్ ఇందులో కనిపించే లుక్, యాక్షన్ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.