Prasanth Varma : చిన్నప్పుడు తనకు చదువు చెప్పిన టీచర్లతో ‘హనుమాన్’ డైరెక్టర్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..

ప్రశాంత్ వర్మ తాజాగా తాను చదివిన స్కూల్ లో రీ యూనియన్ కి హాజరవ్వగా ఆ ఫోటోలని పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Prasanth Varma : చిన్నప్పుడు తనకు చదువు చెప్పిన టీచర్లతో ‘హనుమాన్’ డైరెక్టర్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..

Prasanth Varma Meet his Childhood Teachers and Friends photos goes Viral

Updated On : August 13, 2024 / 5:55 PM IST

Prasanth Varma : మొదట్నుంచి కొత్త కొత్త కథలతో మెప్పించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సంవత్సరం సంక్రాంతికి హనుమాన్ సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించాడు. ఎవరూ ఊహించనంత భారీ విజయం సాధించి ఈ చిన్న సినిమా 350 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమాల గురించి కూడా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు.

ప్రశాంత్ వర్మ తాజాగా తాను చదివిన స్కూల్ లో రీ యూనియన్ కి హాజరవ్వగా ఆ ఫోటోలని పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. గతంలో కూడా పలుమార్లు ప్రశాంత్ వర్మ పాలకొల్లులో తను చదివిన శ్రీ సరస్వతి శిశుమందిర్ గురించి గొప్పగా చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసాడు. ఇప్పటికే డైరెక్టర్ అయ్యాక కూడా పలుమార్లు ప్రశాంత్ వర్మ తను చదివిన స్కూల్ ని సందర్శించాడు.

Also Read : Amala Paul : భర్త, కొడుకుతో ఫస్ట్ మీట్ యానివర్సరీ చేసుకున్న అమలాపాల్.. ఫోటోలు వైరల్..

తాజాగా తన బ్యాచ్ రీ యూనియన్ లో పాల్గొన్న ప్రశాంత్ వర్మ అక్కడ టీచర్లతో, తన ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలను షేర్ చేసి.. 20 ఏళ్ళ తర్వాత శ్రీ సరస్వతి శిశుమందిర్ లో మళ్ళీ కలుసుకున్నాం. మేము ఎక్కడ మొదలుపెట్టామో అక్కడకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నా చుట్టూ నా టీచర్లు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్లంతా నా జర్నీలో తోడున్నారు. ఇవాళ్టికి ఇవి మంచి జ్ఞాపకాలు అని పోస్ట్ చేసాడు. ఈ ఫొటోల్లో ప్రశాంత్ వర్మ తన టీచర్లతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడినట్టు, పలకరించినట్టు, వాళ్ళతో సంతోషంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.