Salaar Trailer : ప్రభాస్ సలార్ పార్ట్ 1 ట్రైలర్ వచ్చేసింది.. ఎరైనా అవుతా సొరైనా అవుతా

ప్రశాంత్ నీల్, ప్రభాస్ కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ట్రైలర్ వచ్చేసింది.

Salaar Trailer : ప్రభాస్ సలార్ పార్ట్ 1 ట్రైలర్ వచ్చేసింది.. ఎరైనా అవుతా సొరైనా అవుతా

Prashanth Neel Prabhas Salaar Part 1 Ceasefire trailer released

Updated On : December 2, 2023 / 9:58 AM IST

Salaar Trailer : రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబోలో తెరకెక్కుతున్న సలార్’ సినిమా కోసం దేశమంతా ఎదురు చూస్తుంది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ అనేక వాయిదాల తర్వాత డిసెంబర్ 22న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై కావాల్సినంత హైప్ ఉంది. నేడు డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించి అందరూ సలార్ ట్రైలర్ కోసం ఎదురుచూసేలా చేశారు.

సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ట్రైలర్ ని నేడు రాత్రి గం.7:19 నిమిషాలకు రిలీజ్ చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ లో తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో రిలీజ్ చేశారు. సలార్ పార్ట్ 1 ట్రైలర్ 3 నిమిషాల 47 సెకండ్స్ ఉంది.

Also read : Animal Movie Review : యానిమల్ మూవీ రివ్యూ.. నాన్న ఎమోషన్‌కి మాస్ జోడించి ఏడిపించిన సందీప్ వంగా..

ఈ మూవీ కథ ఫ్రెండ్‌షిప్ చుట్టూ తిరుగుతుందని, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బిగ్ ఎనిమీస్ గా ఎలా మారారు అనేది సినిమా కథ అని ప్రశాంత్ నీల్ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక ట్రైలర్ లో చూపించిన కథనం ఏంటంటే.. చిన్నప్పుడే ఈ ఇద్దరు మిత్రులు విడిపోతారు. అయితే ప్రభాస్, తన స్నేహితుడు పృథ్వీరాజ్ కి అప్పుడు ఒక మాట ఇస్తాడు. నీకు ఎప్పుడు సహాయం కావాలన్నా నేను ఇక్కడ ఉంటా అని చెబుతాడు. నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా అంటూ మాట ఇస్తాడు.

ఇక పెద్దయ్యాక పృథ్వీ రాజ్ కి ఒక సమస్య వస్తుంది. ఒక పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో తన సైన్యం అయిన ప్రభాస్ ని కలిసి సహాయం అడుగుతాడు. ఇక స్నేహితుడు కోసం సలార్ చేసే విధ్వంసం సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే. ట్రైలర్ అయితే అదిరిపోయింది. మరి ఆ ట్రైలర్ ని మీరుకూడా చూసేయండి.