షార్ట్ ఫిలింకి సీక్వెల్ గా సినిమా.. ‘ఆ గ్యాంగ్ రేపు 3’
ఇటీవల సినిమాలకు సీక్వెల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ టీమ్ షార్ట్ ఫిలింకి సినిమాని సీక్వెల్ గా తీస్తున్నారు.

Preeti Sundar
ఇటీవల సినిమాలకు సీక్వెల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ టీమ్ షార్ట్ ఫిలింకి సినిమాని సీక్వెల్ గా తీస్తున్నారు. యూట్యూబ్‌లో లో బాగా వైరల్ అయిన షార్ట్ ఫిల్మ్ ‘ఆ గ్యాంగ్ రేపు’. దానికి గతంలోనే ‘ఆ గ్యాంగ్ రేపు-2’ అనే షార్ట్ ఫిలిం సీక్వెల్ తీశారు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘ఆ గ్యాంగ్ రేపు-3’ అనే సినిమా రాబోతుంది. సహచర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నోక్షియస్ నాగ్స్ నిర్మాణంలో యోగీ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. నరేన్ అన్నసాగరం, ప్రీతి సుందర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. SIIMA అవార్డు గెలుచుకున్న సంగీత దర్శకుడు కబీర్ రఫీ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
Also Read : My Baby : తెలుగులో వాయిదా పడ్డ తమిళ్ సూపర్ హిట్ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్..
నేడు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్, ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందో ప్రకటించనున్నారు. ఇక ఆ గ్యాంగ్ రేపు 3 సినిమా ట్రైలర్ జూలై 16న రిలీజ్ అవ్వనుంది.