Hyderabad: రేపు, ఎల్లుండి ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్
పటాన్చెరు-హైదర్‌నగర్, కలబ్గూర్-పటాన్చెరు వరకు పీఎస్సీ పంపింగ్ మెయిన్‌లో పలు ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడడంతో రిపేరింగ్ పనులు జరుగుతాయి.
- పీఎస్సీ పంపింగ్ మెయిన్‌లో లీకేజీలు
- పటాన్చెరు-హైదర్‌నగర్ మధ్య..
- కలబ్గూర్-పటాన్చెరు వరకు రిపేర్లు
Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి నీళ్లు బంద్ కానున్నాయి. పటాన్చెరు-హైదర్‌నగర్, కలబ్గూర్-పటాన్చెరు వరకు పీఎస్సీ పంపింగ్ మెయిన్‌లో పలు ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడడంతో రిపేరింగ్ పనులు జరుగుతాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 10 గంటల వరకు ఈ పనులను కొనసాగిస్తారు.
Also Read: దుమ్మురేపుతోన్న మన దేశ “సర్వం ఏఐ”.. ఈ 3 ఏరియాల్లో చాట్ జీపీటీని దాటేసింది..
నీళ్లు బంద్ అయ్యే ప్రాంతాలు
- ఆర్సీ పురం
- అశోక్ నగర్
- జ్యోతి నగర్
- లింగంపల్లి
- చందానగర్
- గంగారం
- మదీనాగూడ
- మియాపూర్
- బీరంగూడ
- అమీన్పూర్
- భాగ్యనగర్ కాలనీ
- ఆఫ్ టేక్ పాయింట్స్
- బల్క్ కనెక్షన్లు
- ఎర్రగడ్డ
- ఎస్ఆర్ నగర్
- అమీర్‌పేట్
- కూకట్పల్లి
