My Baby : తెలుగులో వాయిదా పడ్డ తమిళ్ సూపర్ హిట్ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్..

ఈ సినిమా తెలుగులో ‘మై బేబీ’ అనే టైటిల్ తో రిలీజ్ కానుంది.

My Baby : తెలుగులో వాయిదా పడ్డ తమిళ్ సూపర్ హిట్ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్..

My Baby

Updated On : July 12, 2025 / 7:57 PM IST

My Baby : తమిళంలో సూపర్ హిట్ అయిన DNA సినిమా తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఒలంపియా మూవీస్ బ్యానర్ పై నెల్సన్ వెంకటేసన్ దర్శకత్వంలో అధర్వ మురళి, నిమిషా సజయన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా DNA. ఇటీవలే జూన్ 20న తమిళ్ లో రిలీజయి ఈ సినిమా మంచి హిట్ అయింది.

గతంలో ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా.. లాంటి సూపర్ హిట్ తమిళ్ సినిమాలని తెలుగులోకి డబ్బింగ్ చేసి హిట్స్ కొట్టిన సురేష్ కొండేటి ఇప్పుడు SK పిక్చర్స్ బ్యానర్ ద్వారా తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు.

Also Read : Allu Arjun : రెండు కాదు.. ఏకంగా నాలుగు.. ఇదే జరిగితే బన్నీ ఫ్యాన్స్ కి పండగే..

ఈ సినిమా తెలుగులో ‘మై బేబీ’ అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. మొదట జులై 11న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. పలు కారణాలతో వాయిదా పడగా కొత్త డేట్ ని ప్రకటించారు. మై బేబీ సినిమా జులై 18న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. 2014 లో ఒక వ్యక్తి జీవితంలో జరిగిన నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాని తీశారు.

Tamil Super Hit DNA Movie Releasing in Telugu with My Baby Title

Also Read : Producer Raja : సినిమా రివ్యూ నెగిటివ్ గా ఇచ్చాడని.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత..