SSMB29: ‘కుంభ’ గా పృథ్వీరాజ్.. SSMB29 నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది..

ఈ దుష్ట, క్రూరమైన, శక్తివంతమైన విరోధి కుంభకు ప్రాణం పోయడం సృజనాత్మకంగా(SSMB29) చాలా సంతృప్తికరంగా ఉంది.

SSMB29: ‘కుంభ’ గా పృథ్వీరాజ్.. SSMB29 నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది..

Prithviraj Sukumaran's first look from Mahesh Babu-Rajamouli's film released

Updated On : November 7, 2025 / 12:27 PM IST

SSMB29: దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను (SSMB29)విడుదల చేశాడు రాజమౌళి. రోబోటిక్ వీల్ చైర్ లో కాళ్ళు చచ్చుబడిపోయి ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఆయన వెనకాల జనాలు పరిగెడుతున్నటుగా షాట్స్ ఉన్నాయి. ఈ పోస్టర్ ను విడుదల చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు రాజమౌళి.

Vicky Kaushal-Katrina Kaif: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్‌.. ఆనందంలో విక్కీ కౌశల్ పోస్ట్

“పృథ్వీతో మొదటి షాట్ చిత్రీకరించిన తర్వాత, నేను అతని దగ్గరకు వెళ్లి, మీరు నాకు తెలిసిన అత్యుత్తమ నటులలో ఒకరు అని చెప్పాను. ఈ దుష్ట, క్రూరమైన, శక్తివంతమైన విరోధి కుంభకు ప్రాణం పోయడం సృజనాత్మకంగా చాలా సంతృప్తికరంగా ఉంది. తన కుర్చీలో జారిపోయినందుకు పృథ్వీకి ధన్యవాదాలు”అంటూ రాసుకొచ్చాడు రాజమౌళి. ఈ ఒక్క పోస్టర్ తో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి.