Priyadarshi : ‘గేమ్ ఛేంజర్’కి 25 రోజులు షూట్ చేశాను.. సినిమాలో 2 నిముషాలు కూడా కనపడను.. ప్రియదర్శి కామెంట్స్ వైరల్..

గేమ్ ఛేంజర్ సినిమాలో ప్రియదర్శి రామ్ చరణ్ ఫ్రెండ్ పాత్రలో అక్కడక్కడా ఓ రెండు నిమిషాలే కనిపిస్తాడు.

Priyadarshi : ‘గేమ్ ఛేంజర్’కి 25 రోజులు షూట్ చేశాను.. సినిమాలో 2 నిముషాలు కూడా కనపడను.. ప్రియదర్శి కామెంట్స్ వైరల్..

Priyadarshi Intersting Comments on his Character in Ram Charan Shankar Game Changer Movie

Updated On : March 11, 2025 / 4:56 PM IST

Priyadarshi : పెళ్లిచూపులు సినిమాతో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియదర్శి తర్వాత కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు. బలగం సినిమాతో హీరోగా కూడా హిట్ కొట్టి ఇప్పుడు హీరోగా కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రియదర్శి మెయిన్ లీడ్ లో నటించిన కోర్ట్ సినిమా మార్చ్ 14 రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రియదర్శి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ప్రియదర్శి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడాడు. గేమ్ ఛేంజర్ సినిమాలో ప్రియదర్శి రామ్ చరణ్ ఫ్రెండ్ పాత్రలో అక్కడక్కడా ఓ రెండు నిమిషాలే కనిపిస్తాడు. ఆ పాత్ర పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు. ప్రాముఖ్యత లేని మరీ అంత చిన్న పాత్ర చేయడం ఏంటి అని ప్రశ్న ఎదురైంది.

Also Read : Divi – Mahesh Babu : మహేష్ బాబుకి అక్కడ పుట్టుమచ్చ ఉంది.. షూట్ లో దాని గురించి మాట్లాడితే.. మహేష్ తో చాలా సీన్స్ కానీ..

ప్రియదర్శి దీనికి సమాధానమిస్తూ.. గేమ్ ఛేంజర్ సినిమా బలగం కంటే ముందు ఒప్పుకున్న సినిమా. అప్పుడు నేను హీరో ఫ్రెండ్ పాత్రలు చేస్తున్నాను. ఆ సినిమా ఎంత లేట్ అయిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాలో చాలా సీన్స్ చేశాను. అవన్నీ ఎడిటింగ్ లో పోయాయి. నా పాత్ర తక్కువ సేపు ఉండటానికి అంతకంటే పెద్ద కారణం ఏమి లేదు. చేసే ముందే నాది చిన్న పాత్ర అని నాకు తెలుసు. నేను 25 రోజులు గేమ్ ఛేంజర్ సినిమాకు పనిచేసాను. 2 నిముషాలు కూడా సినిమాలో ఉండను. శంకర్ గారి డైరెక్షన్, రామ్ చరణ్ సినిమా, తిరు గారు కెమెరామెన్ అని చేశాను. శంకర్ గారి డైరెక్షన్ లో సినిమా మళ్ళీ వస్తుందో రాదో తెలీదు. అందుకే ఆయనతో పని చేసే ఛాన్స్ వస్తుందని చేశాను అని తెలిపారు.

శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా భారీగా తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్ ఇటీవల సంక్రాంతికి రిలీజయి యావరేజ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.