Priyamaina Priya : ఆగష్టు 4న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రియమైన ప్రియ’
అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రియమైన ప్రియ’.(Priyamaina Priya). ఏజే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై ఏజే సుజిత్, ఏ బాబు నిర్మించారు.

Priyamaina Priya
Priyamaina Priya Release : అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రియమైన ప్రియ’.(Priyamaina Priya). ఏజే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై ఏజే సుజిత్, ఏ బాబు నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా సంగీతం అందించారు. ఈ సినిమా దేవాకు సంగీత దర్శకుడిగా 100వ సినిమా కావడం విశేషం.
Karthi : 96 దర్శకుడితో కార్తీ సినిమా.. నేషనల్ అవార్డు విన్నెర్స్ నిర్మాత అండ్ కెమెరా మ్యాన్..
తమిళ్ లో ప్రియముడన్ ప్రియ , తెలుగులో ప్రియమైన ప్రియ గా మన స్క్రీన్ మ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా థియేటర్లలో విడుదల కానుంది. ఆగస్టు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో దర్శకుడు ఏజే సుజిత్ మాట్లాడుతూ.. సినిమా నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. స్క్రీన్ ప్లే, హీరో హీరోయిన్స్ నటన , శ్రీకాంత్ దేవా అందించిన సంగీతం హైలెట్‌గా నిలుస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మన స్క్రీన్ మ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ విడుదల చేస్తున్నామని, తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు.

Priyamaina Priya
Tiger Nageswara Rao : రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ పోస్ట్‌పోన్.. నిజమేనా..?