Karthi : 96 దర్శకుడితో కార్తీ సినిమా.. నేషనల్ అవార్డు విన్నెర్స్ నిర్మాత అండ్ కెమెరా మ్యాన్..

ప్రస్తుతం 'జపాన్' (Japan) అనే యాక్షన్ కామెడీ ఫిలింలో నటిస్తున్న తమిళ్ హీరో కార్తీ.. తన తదుపరి సినిమాని క్రేజీ కాంబినేషన్ లో సెట్ చేశాడు. 96 దర్శకుడు, నేషనల్ అవార్డు విన్నెర్స్ నిర్మాత అండ్ కెమెరా మ్యాన్..

Karthi : 96 దర్శకుడితో కార్తీ సినిమా.. నేషనల్ అవార్డు విన్నెర్స్ నిర్మాత అండ్ కెమెరా మ్యాన్..

Karthi next movie with 96 director Premkumar Chandran under suriya production

Karthi : తమిళ్ హీరో కార్తీ ప్రస్తుతం ‘జపాన్’ (Japan) అనే యాక్షన్ కామెడీ ఫిలింలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ తరువాత కార్తీ.. క్రేజీ కాంబినేషన్ లో మూవీ సెట్ చేశాడు. 2018 లో విజయ్ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన క్లాసిక్ లవ్ స్టోరీ మూవీ ’96’. ఆ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అవ్వడంతో తెలుగులో ‘జాను’ టైటిల్ తో శర్వానంద్ రీమేక్ చేశాడు. తమిళ్ అండ్ తెలుగు ఈ కథని ‘ప్రేమ్ కుమార్ చంద్రన్’ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ దర్శకుడు కలయికలోనే కార్తీ తన తదుపరి సినిమా చేయబోతున్నాడు.

Tiger Nageswara Rao : రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ పోస్ట్‌పోన్.. నిజమేనా..?

ఈ సినిమాకి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. నేషనల్ అవార్డు అందుకున్న నిర్మాత, కెమెరా మ్యాన్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం. కార్తీ అన్నా వదినలు సూర్య అండ్ జోతిక 2D ఎంటర్టైన్మెంట్ పతాకం పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ లోనే ఇప్పుడు ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఇక ఈ చిత్రానికి స్టార్ కెమెరా మ్యాన్ పి సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ మరో ప్లస్ కాబోతుంది. ఈ ప్రాజెక్ట్ లో అరవింద్ స్వామి ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. ఈ విషయాలు అన్ని శ్రీరామ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

OMG 2 : దేవుడి సినిమాకి ‘A’ సర్టిఫికెట్ రావడమా..? ‘ఓ మై గాడ్’ రిలీజ్‌కి ముందే 27 సన్నివేశాలు..!

 

View this post on Instagram

 

A post shared by PC Sreeram Isc (@pcsreeram.isc)

ఈ చిత్రాన్ని త్వరలోనే అఫీషియల్ గా లాంచ్ చేసి పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. ఈ సినిమాని కూడా 96 వంటి గుండెకు హత్తుకునే కథతో తెరకెక్కిస్తాడో? లేదా కొత్త జోనర్ లో ఆడియన్స్ ని అలరిస్తారో చూడాలి. ఏదేమైనా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మాత్రం మంచి బజ్ అయితే క్రియేట్ అయ్యింది. ఇక కార్తీ ఇప్పుడు నటిస్తున్న జపాన్ మూవీ విషయానికి వస్తే.. 2019లో చెన్నైలోని లలితా జ్యువెలరీ షాప్ లో దాదాపు 13 కోట్ల విలువైన బంగార ఆభరణాలు, వజ్రాలను దొంగతనం చేసిన తిరువారూర్ ముర్గన్ అనే వ్యక్తి కథ ఆధారంగా తెరకెక్కబోతుందని తెలుస్తుంది.