Priyanka Chopra : ముంబైలో సిటాడెల్ స్పెషల్ ప్రీమియర్.. హాలీవుడ్ స్టార్స్ తరలి వచ్చిన వేళ..

త్వరలో రిలీజ్ కానున్న ఈ సిటాడెల్ సిరీస్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్రయూనిట్. హాలీవుడ్ సిరీస్ అయినా ఇండియాలో కూడా హిందీతో పాటు లోకల్ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

Priyanka Chopra : ముంబైలో సిటాడెల్ స్పెషల్ ప్రీమియర్.. హాలీవుడ్ స్టార్స్ తరలి వచ్చిన వేళ..

Priyanka Chopra citadel series premiere at Mumbai (Photo:Twitter)

Updated On : April 4, 2023 / 7:41 AM IST

Priyanka Chopra :  బాలీవుడ్(Bollywood) లో సక్సెస్ అయిన తర్వాత హాలీవుడ్(Hollywood) వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది ప్రియాంక చోప్రా(Priyanka Chopra). హాలీవుడ్ లో వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్(Richard Madden) మెయిన్ లీడ్స్ లో థ్రిల్లర్ జోనర్ లో హై యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కించిన సిరీస్ సిటాడెల్. హాలీవుడ్ ప్రముఖ దర్శకులు రూసో బ్రదర్స్ ఈ సిరీస్ ని తెరకెక్కించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సిటాడెల్ ఏప్రిల్ 28న గ్రాండ్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన సిటాడెల్ ట్రైలర్ బాగా వైరల్ అయింది. ఇందులో ప్రియాంక చోప్రా తన యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసింది. త్వరలో రిలీజ్ కానున్న ఈ సిటాడెల్ సిరీస్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్రయూనిట్. హాలీవుడ్ సిరీస్ అయినా ఇండియాలో కూడా హిందీతో పాటు లోకల్ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

Shahrukh Khan : నీకు బ్యూటిఫుల్ పిల్లలు ఉన్నారు.. భార్య పోస్ట్ కి షారుఖ్ సరదా కామెంట్..

Priyanka Chopra citadel series premiere at Mumbai

తాజాగా సిటాడెల్ సిరీస్ స్పెషల్ ప్రీమియర్ షోని ముంబైలో వేశారు చిత్రయూనిట్. ఈ ప్రీమియర్ కి ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ తో పాటు ఇండియా అమెజాన్ టీం పాల్గొంది. ఈ ప్రీమియర్ కు పలువురు హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు కూడా విచ్చేసారు. ప్రీమియర్ అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి సిరీస్ గురించి ప్రమోట్ చేశారు. ప్రియాంక, రిచర్డ్ ఫొటోలకు ఫోజులిచ్చారు.