అమెజాన్ తో ప్రియాంకా చోప్రా ఫస్ట్ లుక్ టీవీ డీల్ : మల్టీమిలియన్ డాలర్ల ఒప్పందంతో సంతకం

  • Published By: nagamani ,Published On : July 1, 2020 / 12:11 PM IST
అమెజాన్ తో ప్రియాంకా చోప్రా ఫస్ట్ లుక్ టీవీ డీల్ : మల్టీమిలియన్ డాలర్ల ఒప్పందంతో సంతకం

Updated On : July 1, 2020 / 12:27 PM IST

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ప్రియాంకా చోప్రా గ్లోబల్ టెవివిజన్ అమెజాన్ ప్రైమ్ తో డీల్ కుదుర్చుకుని సంతకం చేశారు. మల్టీ మిలియన్ డాలర్లతో రెండు సంవత్సరాలకు కుదుర్చుకున్న ఈ డీల్ ప్రియాంకా చోప్రాకు మొట్టమొదటి టెలివిజన్ డీల్ కావటం విశేషం. దీనికి సంబంధించి ప్రియాంకా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

దీని గురించి ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ..ఎన్నో విషయాలను పంచుకున్నారు. 20 సంవత్సరాల నా కెరీర్ లో 60 సినిమాల తరువాత నేను అమెజాన్ తో మొదటిసారి ఒప్పందం కుదుర్చుకున్నానని తెలిపారు.

సినిమాలో ఒక నటిగా ఇప్పటి వరకూ తనను అభిమానులు ఎంతగానో ఆదరించారని తెలిపిన ఆమె అమెజాన్ తో ఈ అంగీకారం నాకు చాలా సంతోషాన్ని కలిగించిందనీ అన్నారు. అమెజాన్ ప్రపంచానికి ఇదొక బ్రాండ్. అమెజాన్ ఎంతో సృజనాత్మక ప్రతిభ ఉన్న ఓపెన్ కాన్వాస్ లాంటిది..అటువంటి అమెజాన్ తో కలిసి పనిచేయటం చాలా గర్వంగా ఫీలవుతున్నానని అన్నారు. ఇది కొత్త యత్నానికి పునాదిలాంటిదని తన ఇన్ స్టాగ్రామ్ లో తెలిపారామె.

అమెజాన్ తో కలిసి పనిచేయటం అనేది గ్లోబల్ డీల్. నేను హిందీ భాష చేయగలను..ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా చాలా కంఫ్టర్ట్ బుల్ గా చేయగలను..అంతేకాదు నాకు నచ్చితే ఏ భాష అయినా చేయగలనని ఆత్మవిశ్వాసంతో తెలిపారు.

తాను కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చానని… ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని..తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో… రెకమెండేషన్ తో వచ్చిన ఒక హీరోయిన్ కోసం..తనను ఓ సినిమా నుంచి తప్పించారని తెలిపారు. కఠినమైన సందర్భాలు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో తాను నేర్చుకున్నానని..అలాగే కొత్త అవకాశాలువచ్చినప్పుడు అందిపుచ్చుకుంటూ ప్రతీ మనిషి పైకి ఎదగాలని ఆమె సూచించారు,

తమ గమ్యం గురించి తప్ప..ఇతర ఏ విషయాల గురించి ఆలోచించి మనస్సు పాడు చేసుకోకుండా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని కఠిన సమాయాల్లో నిర్ణయించుకున్నానని… ఓటమి అనే భయాన్ని దగ్గరకు రానివ్వరాదని ప్రతిక్షణం తనను తాను మార్గనిర్దేశం చేసుకునేదాన్నని ప్రియాంక తెలిపారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో ఇండస్ట్రీలో సక్సెస్ ను సాధించానని..ఇప్పుడు అమెజాన్ తో తాను డీల్ కుదుర్చుకునే అవకాశం రావటం కూడా తన కెరీర్ లో చాలా పెద్ద ఎచీవ్ మెంట్ అని అన్నారు ప్రియాంకా చోప్రా.

దీనిపై అమెజాన్ స్టూడియోస్ హెడ్ జెన్నిఫర్ సాల్కే మాట్లాడుతూ.. “ప్రియాంకకు మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి అనీ..విభిన్న వరల్డ్ స్టోరీల పట్ల మంచి అభిరుచి ఉన్న వ్యక్తి అనీ అటువంటి ప్రియాంకతో మా ఒప్పందం చాలా సంతోషంగా ఉందని అన్నారు.కంటెంట్ ను చక్కగా ప్రజెంట్ చేయగల సత్తా ఆమెకు ఉందని ఆమెతో మా ప్రయాణం మాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

Read:అతనితో ఎలాంటి సంబంధం లేదు.. విచారణ తర్వాత మీడియా ముందుకు వస్తా: షమ్నా ఖాసిం