సమంత ఓట్స్ క్యారెట్ ఇడ్లీ.. కుర్రాడి డ్యాన్స్‌కు లావణ్య ఫిదా.. ప్రియాంక ‘Unfinished’ కి అదిరిపోయే రెస్పాన్స్..

Priyanka Chopra: బాలీవుడ్ హీరోయిన్‌గా ప్రేక్షకాభిమానులను మెప్పించి హాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు Priyanka Chopra Jonas. తన ప్రయాణాన్ని Unfished అనే పుస్తకం రూపంలో తీసుకురాబోతున్నట్లు ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకం పూర్తయ్యింది. జనవరి 19న ఈ పుస్తకం మార్కెట్‌లో కానుంది.
ఈ విషయాన్ని ప్రియాంక చోప్రా తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ పుసక్తం కవర్‌పేజీని షేర్ చేశారు. ఈ పుస్తకాన్ని ప్రీ బుకింగ్‌లో కొనుగోలు చేయవచ్చునని అమెజాన్ తెలియజేయగానే అమెరికాలో భారీ డిమాండ్ ఏర్పడింది. గత 24 గంటల్లో అత్యధిక ప్రీ బుకింగ్స్ పొందిన పుస్తకంగా అన్‌ఫినిష్డ్ పుసక్తం నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రియాంక హ్యాపీగా ఫీలయ్యారు.
Wow! #1 Best Seller in Biographies & Autobiographies on @amazon in India! ?? This is unreal. Thank you, thank you! pic.twitter.com/hO37CMBLI1
— PRIYANKA (@priyankachopra) October 3, 2020
Samantha Akkineni: ఉపాసన కొణిదెల ప్రారంభించిన URlife అనే వెబ్ సైట్‌కు అతిథి సంపాదకురాలిగా స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని పేరుని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా సమంత బ్రేక్‌ఫాస్ట్‌గా ‘ఓట్స్ కారెట్ ఇడ్లీ’ ను ఎలా తయారు చేయాలో చెప్పారు. ఈ బ్రేక్‌ఫాస్ట్ వంటకంలో ఏ పదార్థాలను ఉపయోగించాలి, ఎలా చేయాలనే దాన్ని వీడియో రూపంలో చూపించారు.
మూమూలు ఇడ్లీల్లో carbohydrates ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది పూర్తిస్థాయి పోషకాలను ఇవ్వదు. ఇడ్లీకి ఓట్స్, క్యారెట్ చేర్చడం వల్ల ఆ ఇడ్లీ nutriuses గా మారిపోతుంది. అందుకే ఈ రెసీపీని ఎంచుకున్నానని, తను వారంలో రెండు మూడు సార్లైనా ఇడ్లీను అల్పాహారంగా తీసుకుంటానని సమంత చెప్పారు.
Lavanya Tripathi: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ఓ పంజాబీ బాలుడు బాంగ్రా డ్యాన్స్ చేస్తున్న వీడియో అది. ఓ ఇంటి గేటు లోపల ఉన్న కుక్క పిల్లలతో సరదాగా ఆడుకుంటుండగా లోపలున్న వారు వీడియో తీశారు.
ఆ చిన్నారి డ్యాన్స్ చేస్తుంటే.. ఆ పప్పీలు కూడా గెంతులు వేయడం అందరినీ ఆకట్టుకుంటుంది. వినేశ్ కటారియా అనే జర్నలిస్ట్ ఈ వీడియోను షేర్ చేయగా.. దాన్ని రీట్వీట్ చేసిన లావణ్య… ఈ ఉషోదయం మరింత ప్రకాశవంతమవడానికి.. అంటూ కామెంట్ చేశారు.
Here’s something to brighten your morning!❤️☺️ https://t.co/akCuDF0b1R
— LAVANYA (@Itslavanya) October 4, 2020