Little Hearts 2 : ‘లిటిల్ హార్ట్స్’ సీక్వెల్ ఫిక్స్.. కొత్త హీరోతో.. ఎప్పుడంటే.. క్లారిటీ ఇచ్చేసిన నిర్మాత..
తాజాగా ఈ సినిమా నిర్మాత ఆదిత్య హాసన్ లిటిల్ హార్ట్స్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు. (Little Hearts 2)
Little Hearts 2
Little Hearts 2 : మౌళి, శివాని నగరం జంటగా గత సంవత్సరం వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. యూత్ తో పటు అని రకాల ప్రేక్షకులను మెప్పించి ఈ సినిమా భారీ విజయం సాధించింది. కేవలం 2 కోట్లతో ఈ సినిమాని తెరకెక్కించగా ఏకంగా 30 కోట్లు వసూలు చేసింది. క్యూట్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించారు. లిటిల్ హార్ట్స్ రిలీజయి ఇటీవలే ఒక సంవత్సరం అయింది.
తాజాగా ఈ సినిమా నిర్మాత ఆదిత్య హాసన్ లిటిల్ హార్ట్స్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు. లిటిల్ హార్ట్స్ సినిమాలో క్లైమాక్స్ లో హీరో తమ్ముడు నిఖిల్ – హీరోయిన్ చెల్లి నీలాంబరి బయట కలుసుకున్నట్టు, క్లోజ్ అయినట్టు చూపించి పార్ట్ 2 ఉంటుందని హింట్ ఇచ్చారు. హీరో తమ్ముడు నిఖిల్ పాత్రలో ఈ సినిమా దర్శకుడు సాయి మార్తాండ్ నటించాడు. హీరోయిన్ చెల్లి పాత్రలో ధీర పీసపాటి నటించింది.
Also Read : Aditya Hasan : విదేశాల్లో విద్యార్థులు, రిలేషన్స్.. ‘ఎపిక్’ సినిమాపై దర్శకుడు ఆదిత్య హాసన్ కామెంట్స్..
తాజాగా నిర్మాత ఆదిత్య హాసన్ మాట్లాడుతూ.. లిటిల్ హార్ట్స్ 2 ఉంటుంది. సాయి మార్తాండ్ హీరో. నేనే నిర్మిస్తాను. ప్రస్తుతం సాయి మార్తాండ్ అడివి శేష్ తో దర్శకుడిగా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అయ్యాక లిటిల్ హార్ట్స్ 2 మొదలవుతుంది అని తెలిపాడు. దీంతో సాయి మార్తాండ్ – ధీర జంటగా అడివి శేష్ సినిమా అయ్యాక లిటిల్ హార్ట్స్ 2 మొదలు కాబోతున్నట్టు క్లారిటీ వచ్చేసింది. ఆ సినిమాలో లిటిల్ హార్ట్స్ జంట మౌళి, శివాని గెస్ట్ పాత్రల్లో కనిపిస్తారని అన్నారు నిర్మాత. ఆ సినిమాలో సాయి మార్తాండ్ హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది.

