Agent Movie : ఏజెంట్ సినిమాను కొనడానికి ఎవ్వరూ రావట్లేదా? నిర్మాత అనిల్ సుంకర కామెంట్స్..

గత కొన్ని రోజులుగా ఏజెంట్ సినిమాను నైజాంలో కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ రావట్లేదు, ఏజెంట్ సినిమాకు బయ్యర్లు దొరకట్లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రెస్ మీట్ లో నిర్మాత అనిల్ సుంకరని ఓ మీడియా ప్రతినిధి ఈ విషయంపై ప్రశ్నించాడు.

Agent Movie : ఏజెంట్ సినిమాను కొనడానికి ఎవ్వరూ రావట్లేదా? నిర్మాత అనిల్ సుంకర కామెంట్స్..

Producer Anil Sunkara Comments on Agent Movie Business

Updated On : April 16, 2023 / 4:25 PM IST

Agent Movie : రెండు సంవత్సరాలుగా అక్కినేని అఖిల్(Akkineni Akhil) ఏజెంట్(Agent) సినిమా కోసం కష్టపడుతున్నాడు. కెరీర్ లో మొదటి సారి పూర్తి మాస్, యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు అఖిల్. ఇప్పటివరకు వచ్చిన అఖిల్ సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Most Eligible Bachelor) తప్ప మిగిలిన సినిమాలన్నీ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. దీంతో అఖిల్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మాణంలో ఏజెంట్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

సాక్షి వైద్య ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమవుతుండగా మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ బాగా కష్టపడ్డాడు, సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రయూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

గత కొన్ని రోజులుగా ఏజెంట్ సినిమాను నైజాంలో కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ రావట్లేదు, ఏజెంట్ సినిమాకు బయ్యర్లు దొరకట్లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రెస్ మీట్ లో నిర్మాత అనిల్ సుంకరని ఓ మీడియా ప్రతినిధి ఈ విషయంపై ప్రశ్నించాడు. దీనికి అనిల్ సుంకర సమాధానమిస్తూ.. మేము ఏజెంట్ సినిమాను రెండు నెలల కిందే వేరే వాళ్లకు అమ్మేశాం. సినిమాని మేము రిలీజ్ చెయ్యట్లేదు. సినిమాని ఏ బయ్యర్ కి ఇస్తారనేది మా దగ్గర సినిమా కొన్న వాళ్ళ ఇష్టం. మీరు విన్నవన్నీ అబద్దాలు. సినిమాపై మంచి హైప్ ఉంది. ఇప్పటికే పలువురు నైజాం డిస్ట్రిబ్యూటర్లు నాకు ఫోన్ చేసి సినిమా ఇమ్మని అడుగుతున్నారు. కానీ నేను ఈ సినిమాని ఆల్రెడీ వేరే వాళ్లకు అమ్మేశానని, వాళ్ళని కాంటాక్ట్ అవ్వమని చెప్తున్నాను. సినిమాని వాళ్ళు బయ్యర్లకు ఇస్తారా లేక వాళ్ళే రిలీజ్ చేస్తారా అనేది సినిమా కొన్న వాళ్ళ ఇష్టం అని తెలిపారు.

Shreyas Media : సినిమాలు, ఆర్టిస్టులే కాదు ఈవెంట్స్ కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ..

మరి నిజంగానే ఏజెంట్ సినిమాని వేరే వాళ్లకు అమ్మేశారా, లేక బిజినెస్ కోసం ఇలా చెప్తున్నారా ఆయనకే తెలియాలి. ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతుంది. అఖిల్ ఫుల్ మాస్ పాత్రలో కనిపిస్తుండటంతో అక్కినేని అభిమానులు మాత్రం సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.