Producer Bazaar : దర్శకుల సంఘం సహకారంతో త్వరలో ప్రొడ్యూసర్ బజార్ అవగాహనా సదస్సు

తాజాగా ప్రొడ్యూసర్ బజార్ సహ వ్యవస్థాపకులు డి.విజయ్ దర్శకుల సంఘం నూతన అధ్యక్షుడు వీర శంకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియచేసారు.

Producer Bazaar : దర్శకుల సంఘం సహకారంతో త్వరలో ప్రొడ్యూసర్ బజార్ అవగాహనా సదస్సు

Producer Bazaar meets Telugu Film Directors Association President Veera Shankar

Producer Bazaar : ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ప్రముఖ దర్శకులు వీర శంకర్ గెలుపొందిన విషయం తెలిసిందే. తాజాగా ప్రొడ్యూసర్ బజార్ సహ వ్యవస్థాపకులు డి.విజయ్ దర్శకుల సంఘం నూతన అధ్యక్షుడు వీర శంకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియచేసారు. ప్రొడ్యూసర్ బజార్ చిన్న సినిమాలకు.. కాపీ రైట్స్, మార్కెటింగ్, ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్ వంటి అంశాల్లో సపోర్ట్ చేస్తుంది.

Also Read : Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ షూటింగ్ పూర్తి.. విదేశాల నుంచి స్పెషల్ వీడియో షేర్ చేసిన విజయ్..

తాజాగా దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ ని కలిసిన ప్రొడ్యూసర్ బజార్ సహా వ్యవస్థాపకులు విజయ్ దర్శకుల సంఘం ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు నిర్వహించమని కోరగా దానికి సానుకూలంగా స్పందించారు. ఇటీవలే నిర్మాతల మండలి సహకారంతో నిర్మాతల ప్రయోజనాల కోసం ప్రొడ్యూసర్ బజార్ ఓ అవగాహనా సదస్సును నిర్వహించింది. త్వరలోనే దర్శకుల సంఘం ఆధ్వర్యంలో ప్రొడ్యూసర్ బజార్ అవగాహనా సదస్సు ఉంటుందని సమాచారం.