Guntur Kaaram : గుంటూరు కారం సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత..

గుంటూరు కారం సెకండ్ సింగల్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత నాగవంశీ. ఎప్పుడు రాబోతుందో తెలుసా..?

Guntur Kaaram : గుంటూరు కారం సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత..

Producer Naga Vamsi gave update on Mahesh Babu Guntur Kaaram Second Single

Guntur Kaaram : మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కంప్లీట్ మాస్ మసాలా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమాలో మహేష్ బాబు ఇప్పటివరకు కనిపించినంత మాస్ రోల్ లో కనిపించబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ‘దమ్ మసాలా’ రిలీజ్ అయ్యి మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

కాగా అభిమానులంతా ఇప్పుడు మరో సాంగ్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుందో అని ఒక క్యూరియాసిటీతో ఉన్నారు. తాజాగా సెకండ్ సాంగ్ రిలీజ్ పై నిర్మాత నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. తాజాగా ఈ నిర్మాత తాను నిర్మించిన ఒక మూవీ ఈవెంట్ లో పాల్గొనగా.. ఆయనను ఈ సాంగ్ రిలీజ్ గురించి ప్రశ్నించారు. ఆయన బదులిస్తూ.. సెకండ్ సాంగ్ ని నెక్స్ట్ వీక్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ మొదలయింది.

Also read : Aadi Keshava : శ్రీలీలతో ప్రేమ.. విలన్స్‌తో శివతాండవం.. ‘ఆదికేశవ’ ట్రైలర్ రిలీజ్..

సినిమాలో మొత్తం నాలుగు సాంగ్స్ ఉన్నాయట. మిగిలిన సాంగ్స్ ని త్వరలోనే ఒక్కొక్కటిగా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేస్తామని వెల్లడించారు. మిగిలిన మూడు సాంగ్స్ కూడా ఎంతో బాగా వచ్చాయని. వచ్చే ఏడాదంతా ఈ సినిమా పాటలే వినబడతాయని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. కాగా మొదటి సాంగ్ హీరో మీద సాగింది. మరి ఈ సెకండ్ సింగల్ హీరోహీరోయిన్ డ్యూయెట్..? లేదా సిట్యుయేషనల్ సాంగ్..? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. 2024 జనవరి 12న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.