Movie Theater : ఆసియాలోనే అతిపెద్ద సింగిల్ స్క్రీన్ థియేటర్.. అమరావతిలో.. స్టార్ నిర్మాత ప్లానింగ్.. ప్రభాస్ థియేటర్ ని మించి..

ఇలాంటి టైంలో స్టార్ ఓ స్టార్ నిర్మాత సింగిల్ స్క్రీన్ కడతాను అంటున్నాడు. అది కూడా ఆసియాలోనే అతిపెద్ద థియేటర్ కడతాను అంటున్నారు.

Movie Theater : ఆసియాలోనే అతిపెద్ద సింగిల్ స్క్రీన్ థియేటర్.. అమరావతిలో.. స్టార్ నిర్మాత ప్లానింగ్.. ప్రభాస్ థియేటర్ ని మించి..

Movie Theater

Updated On : July 24, 2025 / 4:22 PM IST

Movie Theater : ఇప్పుడు అందరూ థియేటర్స్ మూసుకుపోతున్నాయి అంటూ గొడవ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ అవుతుంటే మరోపక్క మల్టీప్లెక్స్ లు పెరిగిపోతున్నాయి. పలువురు నిర్మాతలు, హీరోలు కూడా మల్టీప్లెక్స్ ల బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఇలాంటి టైంలో స్టార్ ఓ స్టార్ నిర్మాత సింగిల్ స్క్రీన్ కడతాను అంటున్నాడు. అది కూడా ఆసియాలోనే అతిపెద్ద థియేటర్ కడతాను అంటున్నారు.

ఇంతకీ ఆ నిర్మాత ఎవరంటే.. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ. వరుసగా మంచి సినిమాలతో విజయాలు సాధిస్తూ దూసుకెళ్తున్నారు.

Also Read : Kingdom : వారం రోజుల ముందే విజయ్ దేవరకొండ సినిమాకు టికెట్ రేట్ల పెంపు.. ‘కింగ్డమ్’ కు ఎంత పెంచారంటే?

తాజాగా కింగ్డమ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ.. నేను కూడా థియేటర్స్ బిజినెస్ లోకి వద్దాం అనుకున్నాను. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడున్న పరిస్థితి చెప్పి వద్దన్నారు. అందుకే ఆగాను. నేను వస్తే సింగల్ స్క్రీన్ థియేటర్ కడతాను. ఆసియాలోనే అతిపెద్ద సింగిల్ స్క్రీన్ థియేటర్ ఏపీలో కడతాను. సూళ్లూరుపేటలో వంశీ అన్న థియేటర్ కంటే పెద్దదిగా ప్లాన్ చేస్తాను అన్నారు. అయితే హోస్ట్ ఏపీలో ఎక్కడ అమరావతిలో ప్లాన్ చేస్తారా అని అడగ్గా కుదిరితే చేస్తాను అని తెలిపారు.

ప్రస్తుతానికి ఇండియాలో అతిపెద్ద థియేటర్ గా ప్రభాస్ థియేటర్ ఉంది. ప్రభాస్, అతని ఫ్రెండ్స్ వంశీ కలిసి సూళ్లూరుపేట లోని వీ ఎపిక్ థియేటర్ ని నిర్మించారు. ఈ థియేటర్ సీటింగ్ కెపాసిటీ 670 అయినా వైశాల్యంలో, స్క్రీన్ పరంగా మాత్రం చాలా పెద్దది. ఇప్పుడు నిర్మాత నాగవంశీ ఆ థియేటర్ కంటే పెద్దగా సింగిల్ స్క్రీన్ థియేటర్ కడతాను అని ప్రకటించారు. మరి అమరావతిలో పెద్ద థియేటర్ ఎప్పుడు కడతారో చూడాలి.

Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’లో బాలీవుడ్ భామలు నోరా ఫతేహి, నర్గిస్ ఫక్రి ఎక్కడ? ఆయన కూడా లేరే.. పార్ట్ 2లో ఉంటారా?