Kingdom : వారం రోజుల ముందే విజయ్ దేవరకొండ సినిమాకు టికెట్ రేట్ల పెంపు.. ‘కింగ్డమ్’ కు ఎంత పెంచారంటే?
పెద్ద సినిమాలకు ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు, స్పెషల్ షోలకు అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే.

Kingdom
Kingdom : ఇటీవల పెద్ద సినిమాలకు ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు, స్పెషల్ షోలకు అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో మాత్రం చారిత్రాత్మిక సినిమాలకు తప్ప ఏ సినిమాలకు టికెట్ రేట్లు పెంచమని, స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వమని ప్రభుత్వం ప్రకటించింది. అయితే సినిమా రిలీజ్ కి ఒక రోజు లేదా రెండు రోజుల ముందు టికెట్ రేట్ల పెంపు ప్రకటిస్తారు.
కానీ కింగ్డమ్ సినిమాకు రిలీజ్ కి ఇంకా వారం రోజులు ఉండగానే టికెట్ రేట్ల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కింగ్డమ్. జులై 31న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించగా సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు, మల్టిప్లెక్స్ లలో 75 రూపాయలు రిలీజ్ రోజు నుంచి పది రోజుల పాటు పెంచుకునేలా అనుమతులు ఇచ్చారు. దీంతో కింగ్డమ్ సినిమాకు ఏపీలో టికెట్ రేట్లు పెరగనున్నాయి. స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలు మాత్రం ఏమి లేనట్టు తెలుస్తుంది. ఇక కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జులై 26న తిరుపతిలో నిర్వహించనున్నారు. జులై 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.
Also Read : కన్నడ సినిమాలు, హీరోలు, హీరోయిన్స్ ని మనం నెత్తిన పెట్టుకుంటే.. వాళ్ళు మాత్రం మన సినిమాలకు ఇలా..