TG Vishwa Prasad : మొదట్లో కొన్ని మంచి సినిమాలు చేశాను.. కానీ థియేట్రికల్ రిలీజ్ చేయలేకపోయాను.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు..
నరుడి బ్రతుకు నటన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ..

Producer TG Vishwa Prasad Interesting Comments on Narudi Brathuku Natana Pre Release Event
TG Vishwa Prasad : శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న మెయిన్ లీడ్స్ గా తెరకెక్కిన సినిమా ‘నరుడి బ్రతుకు నటన’. టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి నిర్మాణంలో రిషికేశ్వర్ యోగి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి ఫీల్ తో మెప్పించింది. ఈ సినిమా అక్టోబర్ 25న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సుధీర్ బాబు, డైరెక్టర్ వీరశంకర్, వీజే సన్నీ, శ్రీరామ్ ఆదిత్య, వితిక షెరు.. పలువురు గెస్టులుగా వచ్చారు.
Also Read : Prabhas : జపాన్‌లో ముందుగానే ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రాధేశ్యామ్ రీ రిలీజ్ చేసి..
నరుడి బ్రతుకు నటన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుధీర్ బాబు మాట్లాడుతూ.. టీజీ విశ్వ ప్రసాద్ గారిని పదేళ్ల క్రితం ఆయన ఇండస్ట్రీకి రాకముందు కలిసాను. అప్పట్నుంచే ఆయనకు సినిమాలంటే ప్యాషన్. ఈ సినిమా ట్రైలర్ చూసాను. శివ, నితిన్ ప్రసన్న చాలా ఇంటెన్స్‌గా నటించారు. నా సినిమాల్లో వీరికి సరిపోయే మంచి పాత్రలు ఉంటే కచ్చితంగా రిఫర్ చేస్తాను అని అన్నారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్యాషన్, డబ్బులుంటే మాత్రమే సినిమాల్ని తీయలేం. నేను మొదట్లో కొన్ని సినిమాలు తీసి అవి ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ప్రదర్శించగలిగాను. కానీ థియేట్రికల్ రిలీజ్ చేయలేకపోయాను. నరుడి బ్రతుకు నటన టీంని చూసినప్పుడు నా పాత రోజులు గుర్తుకు వచ్చాయి. అందుకే వాళ్ళ సినిమాకి నేను సహాయం చేసి రిలీజ్ చేస్తున్నాను అని అన్నారు.
శివ కుమార్ రామచంద్రవరపు మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది. అన్నీ బాగుంటే నేషనల్ అవార్డు కూడా వస్తుంది. మొదట్లో చిన్న సినిమాగా మొదలయి ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్ గారి చేతిలో పడి పెద్ద సినిమా అయింది అని అన్నారు. నితిన్ ప్రసన్న మాట్లాడుతూ.. నేను షార్ట్ ఫిల్మ్స్ చేసే టైం నుంచి నాకు డైరెక్టర్ రిషి తెలుసు. ఆయన చాలా ట్యాలెంటెడ్. ఏ రోజు జరిగిన షూట్‌ని ఆ రోజే ఎడిట్ చేసి మాకు చూపించేవాడు. ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అని తెలిపారు.
నిర్మాత డా. సింధు రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాని చూసి కంటెంట్ నచ్చి విశ్వ ప్రసాద్ గారు ముందుకు వచ్చారు. మేం ఎంతో కష్టపడి ఈ తీస్తే మాకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హెల్ప్ దొరికింది. అందుకే ఇక్కడి వరకు వచ్చాం అని అన్నారు.