Prabhas : జపాన్‌లో ముందుగానే ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రాధేశ్యామ్ రీ రిలీజ్ చేసి..

జపాన్ లో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఇప్పట్నుంచే చేస్తున్నారు.

Prabhas : జపాన్‌లో ముందుగానే ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రాధేశ్యామ్ రీ రిలీజ్ చేసి..

Prabhas Birth Day Celebrations Happening in Japan by Prabhas Fans Videos goes Viral

Updated On : October 20, 2024 / 7:34 AM IST

Prabhas : మన సినిమాలకు బయటి దేశాల్లో మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జపాన్ లో మన తెలుగు సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. మన హీరోలకు అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ కి కూడా జపాన్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ కూడా ప్రభాస్ సినిమాలను, ప్రభాస్ బర్త్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.

గతంలో పలుమార్లు ప్రభాస్ సినిమాలను, ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలను జపాన్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన వీడియోలు వైరల్ గా మారాయి. త్వరలో అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజు ఉండటంతో అభిమానులు ఇప్పట్నుంచే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో చేయడం ఒక ఎత్తైతే జపాన్ లో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఇప్పట్నుంచే చేస్తున్నారు.

Also Read : Unstoppable Promo Making : బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో మేకింగ్ వీడియో చూశారా? అదిరిందిగా..

తాజాగా అక్కడి ప్రభాస్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ సినిమాని రీ రిలీజ్ చేసి ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ ని అడ్వాన్స్ గా జరుపుకున్నారు. హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అని పెద్ద బ్యానర్స్, ప్రభాస్ ఫొటోలతో హడావిడి చేసారు. దీంతో జపాన్ లో ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన సందడి వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మెడిలో వైరల్ గా మారాయి.