Project K : ప్రాజెక్ట్ K సినిమా కూడా రెండు పార్ట్స్? బాహుబలి, సలార్ బాటలో ప్రాజెక్ట్ K

ఇప్పటికే ప్రాజెక్ట్ K సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సినిమా నుంచి ఏదో ఒక వరుస అప్డేట్స్ ఇచ్చి సినిమాపై మరింత అంచనాలు పెంచుతోంది చిత్రయూనిట్.

Project K : ప్రాజెక్ట్ K సినిమా కూడా రెండు పార్ట్స్? బాహుబలి, సలార్ బాటలో ప్రాజెక్ట్ K

Project K Movie also releasing in Two Parts talk goes viral

Project K Movie :  ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్(Nag Ahwin) దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K. ప్రస్తుతం ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా అనేకమంది స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సినిమా నుంచి ఏదో ఒక వరుస అప్డేట్స్ ఇచ్చి సినిమాపై మరింత అంచనాలు పెంచుతోంది చిత్రయూనిట్.

అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో టాక్ నడుస్తోంది. బాహుబలి సినిమా రెండు పార్టులుగా వస్తుంది అన్నప్పుడు మొదట అంతా ఆశ్చర్యపోయినా బాహుబలి 1, 2 సినిమాలు భారీ విజయం సాధించడంతో ఇలా ఒక కథని రెండు పార్టులుగా చెప్పొచ్చని అందరూ నమ్మారు. ఆ తర్వాత KGF, ఇటీవల పొన్నియిన్ సెల్వన్, త్వరలో బ్రహ్మాస్త్ర.. ఇలా రెండు పార్టులుగా సినిమాలు వస్తున్నాయి. ఇటీవలే ప్రభాస్ భారీ సినిమాల్లో ఒకటైన సలార్ కూడా రెండు పార్టులు ఉంటుందని ప్రకటించి ప్రేక్షకులని ఆశ్చర్యపోయారు.

Ameesha Patel : ఓటీటీలో సినిమాలు పిల్లలతో కలిసి చూడలేం.. అంతా గే, స్వలింగ సంపర్కం, అసభ్యకర కంటెంట్స్ ఉన్నాయి..

తాజాగా ప్రాజెక్ట్ K సినిమా కూడా రెండు పార్టులుగా ఉండబోతున్నట్టు సినీ పరిశ్రమలో టాక్ నడుస్తుంది. ఈ సినిమా కూడా ప్రభాస్ కెరీర్ లో బాహుబలి లాగే స్పెషల్ ఫిలింలా నిలిచిపోతుందని అంటున్నారు. బాహుబలి రెండు పార్టులుగా వచ్చి భారీ హిట్ కొట్టింది. ఇప్పుడు సలార్ త్వరలో రెండు పార్టులుగా రాబోతుంది. ఇక ప్రాజెక్ట్ K కూడా రెండు పార్టులుగా వచ్చి సూపర్ హిట్స్ కొడతాయని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. ఇదే నిజమైతే బాగుండు అని అభిమానులు అనుకుంటున్నారు. ఇక త్వరలో ప్రాజెక్ట్ K సినిమా కామిక్ కాన్ లో కూడా పాల్గొనబోతుంది. జులై 20న ఈ ఈవెంట్ లో పాల్గొని సినిమాకి సంబంధించిన ముఖ్య ప్రకటన చేస్తారని సమాచారం.