ఆరాధ్య అభినయం : మనవరాలి స్పీచ్‌కు మురిసిన బిగ్ బి

  • Published By: madhu ,Published On : December 23, 2019 / 11:29 AM IST
ఆరాధ్య అభినయం : మనవరాలి స్పీచ్‌కు మురిసిన బిగ్ బి

Updated On : December 23, 2019 / 11:29 AM IST

ఐశ్వర్యారాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ల కూతురు ఆరాధ్య బచ్చన్‌.. మహిళల గొప్పతనం గురించి స్కూల్‌లో మాట్లాడిన ఓ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆరాధ్యను మెచ్చుకుంటున్నారు. వీడియో చూసిన బిగ్‌బీ ఫుల్ ఖుష్ అయ్యారు. ఆరాధ్యను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ట్విటర్ వేదికగా ట్వీట్ చేశారాయన. 
ముంబయిలోని ధీరూభాయ్‌ అంబానీ స్కూల్‌ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి.

స్కూల్‌లో చదువుతున్న బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌ తమ తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు. ఇందులో ఆరాధ్య కూడా చదువుతోంది. వార్షోకత్వవం సందర్భంగా ఓ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది. మహిళల గొప్పతనం, మహిళా సాధికారిత, సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వాలంటూ ఓ స్పీచ్ ఇచ్చింది. ఈ వేడుకకు ఐష్ – అభిషేక్ బచ్చన్ లు హాజరయ్యారు. కూతురు మాటలకు సంతోషం వ్యక్తం చేశారు. పలువురు సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ..పోస్టులు పెట్టారు. 

Read More : రష్మికను ఇబ్బంది పెట్టకండి.. ట్రోల్ చెయ్యొద్దు: అభిమానులకు హీరో రిక్వెస్ట్

అయితే..ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న అమితాబ్‌ ఈ వేడుకకు హాజరు కాలేకపోయారు. దీంతో స్కూల్‌ యాజమాన్యం ఆయన కోసం ప్రత్యేకంగా వీడియో కనెక్షన్‌ ఏర్పాటు చేశారు. అలా ఆరాధ్య ప్రదర్శన చూసిన బిగ్‌బీ.. చిన్నారి ఆరాధ్య గొప్పగా మాట్లాడింది. నాకెంతో గర్వంగా ఉందని ఓ ట్వీట్‌ చేశారు.