PS2: మళ్లీ వాయిదా పడ్డ తమిళ పాన్ ఇండియా మూవీ..?
తమిళ స్టార్ డైరెక్షన్ మణిరత్నం తెరకెక్కించిన ప్రెస్టీజియస్ హిస్టారికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్-1’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను భారీ స్థాయిలో మణిరత్నం తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాలోని కంటెంట్ తమిళ ఆడియెన్స్‌ను మంత్రముగ్ధులను చేసింది.

PS2 Movie Gets Indefinite Postpone
PS2: తమిళ స్టార్ డైరెక్షన్ మణిరత్నం తెరకెక్కించిన ప్రెస్టీజియస్ హిస్టారికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్-1’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను భారీ స్థాయిలో మణిరత్నం తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాలోని కంటెంట్ తమిళ ఆడియెన్స్‌ను మంత్రముగ్ధులను చేసింది.
Ponniyin Selvan 2: సెన్సేషనల్ అప్డేట్.. పొన్నియిన్ సెల్వన్ పార్ట్-2 రిలీజ్ డేట్ ఇదే!
చోళుల కాలం నాటి నేపథ్యంలో ఈ సినిమాను మణిరత్నం మలిచిన తీరు అందరినీ ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. కాగా, పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇప్పటికే మొదటి భాగం ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోగా, ఇప్పుడు అందరి చూపు రెండో భాగంపై పడింది. అయితే ఈ రెండో భాగాన్ని మణిరత్నం వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు.
PS2 Movie: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న క్రేజీ సీక్వెల్ మూవీ.. మణిరత్నం స్ట్రాటెజీ మామూలుగా లేదుగా!
ఇప్పటికే రెండో భాగానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను కూడా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. కానీ, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ నిరవధికంగా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టెక్నికల్ కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడబోతుందని తెలుస్తోంది. మరి ఈ రిలీజ్ వాయిదా విషయంలో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు.