PS2: పొన్నియిన్ సెల్వన్-2 రిలీజ్ వాయిదా.. తూచ్ అంటూ క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను చోళుల కథగా మణిరత్నం తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రం ఫస్ట్ పార్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు అందరి చూపులు ఈ సినిమా రెండో పార్ట్‌పై పడింది.

PS2 Team Gives Clarity On Release Postpone
PS2: తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను చోళుల కథగా మణిరత్నం తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రం ఫస్ట్ పార్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు అందరి చూపులు ఈ సినిమా రెండో పార్ట్‌పై పడింది.
PS2: మళ్లీ వాయిదా పడ్డ తమిళ పాన్ ఇండియా మూవీ..?
ఇక పొన్నియిన్ సెల్వన్-2 చిత్రాన్ని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. కానీ, కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ అనుకున్న సమయానికి కాదని ఇటీవల సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ సినిమా వేసవిలో రిలీజ్ కాకుండా వాయిదా పడుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చేసింది.
PS2 Movie: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న క్రేజీ సీక్వెల్ మూవీ.. మణిరత్నం స్ట్రాటెజీ మామూలుగా లేదుగా!
ఈ సినిమాను ముందుగా అనుకున్న సమయానికే రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ తెలిపింది. ఈమేరకు ఓ చిన్న ఫన్నీ వీడియోను కూడా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ సినిమా వేసవి కానుకగా వస్తుండటంతో ఈ చిత్రాన్ని చూసేందుకు తమిళ ఆడియెన్స్‌తో పాటు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండో పార్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
A tiny glimpse into all the fun the team had while making #PS1 and #PS2! #PS2 in theatres worldwide from April 28 ?#PonniyinSelvan #CholasAreBack #ManiRatnam @arrahman @madrastalkies_ @Tipsofficial @IMAX @primevideoIN @chiyaan @actor_jayamravi @Karthi_Offl #Jayaram pic.twitter.com/bBsHJQ0LcO
— Lyca Productions (@LycaProductions) March 1, 2023