Punam Khaur : ఈటెలను కలిసిన పూనమ్ కౌర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

తాజాగా సినీ నటి పూనమ్ కౌర్ మొన్న గురునానక్ జయంతి సందర్భంగా హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో

Punam Khaur : ఈటెలను కలిసిన పూనమ్ కౌర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Punam

Updated On : November 21, 2021 / 11:38 AM IST

Punam Khaur :  తెలుగు, తమిళ్ లో హీరోయిన్ గా నటించిన పూనమ్ గత కొద్ది కాలంగా సినిమాలకి దూరంగా ఉంది. అడపాదడపా తమిళ్ లో ఒకటో రెండో సినిమాలు చేస్తుంది. కానీ అప్పుడప్పుడు తన ట్వీట్స్ తోను, తన వ్యాఖ్యలతోను వార్తల్లో నిలుస్తుంది పూనమ్. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది పూనమ్ కౌర్.

Viswanathan Anand : బాలీవుడ్ లో చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ బయోపిక్

ఇటివల టీఆర్‌ఎస్‌లో నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ తన పదవులకి రాజీనామా చేసి ఆ తర్వాత బీజేపీలో చేరి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. తాజాగా సినీ నటి పూనమ్ కౌర్ మొన్న గురునానక్ జయంతి సందర్భంగా హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేశారు.

Sankranthi Movies : సంక్రాంతి బిజినెస్ 1000 కోట్లు పైనే..

ఈటెలను కలిసిన పూనమ్ ఆయనకు ఏక్ ఓంకార్ అని రాసి ఉన్న ఫొటోను ఈటల దంపతులకు అందజేశారు. ఆ తర్వాత గురునానక్ జయంతి సందర్భంగా వీరిద్దరూ కలిసి శాంతికి గుర్తుగా పావురాలను ఎగరవేశారు. ఈ ఫొటోలను షేర్ చేసిన పూనమ్ హుజురాబాద్ ఉప ఎన్నికను ఉద్దేశించి ధర్మ పోరాటం ఎప్పటికీ గెలుస్తందని పోస్ట్ చేశారు. అలాగే నిజాయితీ, నిబద్దత, కరుణ గల ప్రజలను బాబా నానక్ ఎల్లప్పుడూ దీవిస్తారు. బాబా నానక్ ను నేనెప్పుడూ చూడలేదు. కానీ కష్టం వచ్చిన ప్రతిసారీ ఆయన ఉన్నారన్న నమ్మకం బలపడింది. ధర్మ యుద్దం ఎప్పుడూ గెలుస్తుంది అంటూ పూనమ్ పోస్ట్ చేసింది.

Rakul Preet Singh : రకుల్‌ప్రీత్ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్.. చెలరేగిన మంటలు..

అయితే పూనమ్ కౌర్ ఈటల రాజేందర్‌ను కలవడం, ఆ ఫొటోలను షేర్ చేస్తూ పెట్టిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మరాయి. ఆమె బీజేపీలో చేరనున్నారని, దానికోసమే ఈటల రాజేందర్‌ను కలిశారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలపై పూనమ్ స్పందించలేదు.