Puri Jagannadh: ఇప్పట్లో మళ్లీ దాన్ని టచ్ చేయనంటోన్న పూరీ.. నిజమేనా?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ సినిమా వస్తుందంటే దాన్ని చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిని చూపుతుంటారు. ఆయన ఏ హీరోతో సినిమా చేసినా కూడా పూరీకి ఉన్న ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఆయన సినిమాలను ఖచ్చితంగా చూస్తారు. అయితే ఆయన తీసిన లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలవడంతో, ప్రస్తుతం ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని కసిగా ఉన్నాడు ఈ డైరెక్టర్.

Puri Jagannadh Decides Not To Do Production Now
Puri Jagannadh: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ సినిమా వస్తుందంటే దాన్ని చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిని చూపుతుంటారు. ఆయన ఏ హీరోతో సినిమా చేసినా కూడా పూరీకి ఉన్న ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఆయన సినిమాలను ఖచ్చితంగా చూస్తారు. అయితే ఆయన తీసిన లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలవడంతో, ప్రస్తుతం ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని కసిగా ఉన్నాడు ఈ డైరెక్టర్.
Puri Jagannadh: పూరీ మళ్లీ ఆ హీరోతో వస్తున్నాడా.. ఈసారి హిట్టు ఖాయమా..?
ఈ క్రమంలోనే తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో తెరకెక్కించాలా అనే ఆలోచనలో ఉన్నాడు పూరీ. అయితే ఈ సందర్భంగా పూరీ ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతకొంత కాలంగా తన సినిమాలను ఛార్మీతో కలిసి ప్రొడ్యూస్ చేస్తూ వచ్చిన పూరీ, ఇకపై ప్రొడక్షన్ విషయాన్ని పూర్తిగా పక్కనబెట్టాలని చూస్తున్నాడట. ప్రస్తుతం ఆయన తన ఫోకస్ పూర్తిగా కేవలం సినిమా డైరెక్షన్ పైనే ఉండేలా చూసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట.
ఇది తెలుసుకున్న పూరీ ఫ్యాన్స్ ఆయన్ను అభినందిస్తున్నారు. పూరీ కేవలం డైరెక్షన్‌పై మాత్రమే ఫోకస్ పెడితే ఆయన బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించడం పెద్ద కష్టమేమీ కాదని.. ఇకపై ఆయన తన దృష్టిని పూర్తిగా డైరెక్షన్‌పై పెట్టి మరోసారి తన ట్యాలెంట్ ఏమిటో నిరూపించుకోవాలని వారు కోరుతున్నారు. ఇక పూరీ ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా కోసం స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.