Double Ismart : మొదలైన డబల్ ఇస్మార్ట్.. పూజా కార్యక్రమాలతో పూరి జగన్నాధ్ సినిమా ఓపెనింగ్..

పూరి లైగర్ తో భారీ దెబ్బ తినడంతో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ని అనౌన్స్ చేశాడు ఇటీవల. డబల్ ఇస్మార్ట్ అనే టైటిల్ ప్రకటించి 8 మార్చ్ 2024 లో రిలీజ్ చేస్తామని కూడా డేట్ ప్రకటించాడు పూరి. తాజాగా నేడు ఈ డబల్ ఇస్మార్ట్ నుంచి అప్డేట్ ఇచ్చారు.

Double Ismart : మొదలైన డబల్ ఇస్మార్ట్.. పూజా కార్యక్రమాలతో పూరి జగన్నాధ్ సినిమా ఓపెనింగ్..

Puri Jagannadh Ram Pothineni Double Ismart movie started with Pooja Ceremony

Updated On : July 11, 2023 / 11:43 AM IST

Ram Pothineni :  2019 లో పూరి జగన్నాధ్ (Puri Jagannadh), రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ (ISmart Shankar) బ్లాక్ బస్టర్ హిట్ అయి ఇద్దరి కెరీర్ కి బూస్ట్ ఇచ్చింది. అప్పటిదాకా లవర్ బాయ్ లా కనిపించిన రామ్ ఈ సినిమాతో పూర్తిగా మాస్ గా మారిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ భారీ విజయం సాధించి కలెక్షన్స్ కూడా బాగా రాబట్టింది. అయితే ఇదే కాంబినేషన్ లో ఈ సినిమాకి సీక్వెల్ వస్తాయి అని గతంలో వార్తలు వచ్చాయి.

Jawan : షారుఖ్ ఖాన్ ‘జవాన్’ టీజర్ రిలీజ్.. నేను విలన్ అయితే నా ముందు నిలబడే హీరో ఎవడూ లేడు..

పూరి లైగర్ తో భారీ దెబ్బ తినడంతో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ని అనౌన్స్ చేశాడు ఇటీవల. డబల్ ఇస్మార్ట్ అనే టైటిల్ ప్రకటించి 8 మార్చ్ 2024 లో రిలీజ్ చేస్తామని కూడా డేట్ ప్రకటించాడు పూరి. తాజాగా నేడు ఈ డబల్ ఇస్మార్ట్ నుంచి అప్డేట్ ఇచ్చారు. నేడు డబల్ ఇస్మార్ట్ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పూరి జగన్నాధ్, రామ్, ఛార్మి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు చిత్రయూనిట్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి వెళ్తున్నట్టు సమాచారం.