Puri Jagannadh: ఆటోజానీ పక్కన పడేశాను – పూరీ జగన్నాధ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు పూరీ జగన్నాధ్‌తో ఇన్‌స్టా లైవ్‌లో ముచ్చటించారు. గాడ్‌ఫాదర్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన పూరీ జగన్నాధ్ చిరుతో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Puri Jagannadh: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించగా, పూర్తి పొలిటికల్ డ్రామా మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలవడంతో మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు పూరీ జగన్నాధ్‌తో ఇన్‌స్టా లైవ్‌లో ముచ్చటించారు.
Puri Jagannadh: నెక్ట్స్ మూవీని ఈ హీరోతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న పూరీ!
గాడ్‌ఫాదర్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన పూరీ జగన్నాధ్ చిరుతో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మెగాస్టార్ స్పూర్తితోనే తాము ఇండస్ట్రీలో అడుగుపెట్టామని పూరీ ఈ సందర్భంగా తెలిపాడు. ఇక ఈ సినిమాలో చిరుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పూరీ తెలిపాడు. కాగా, ఈ క్రమంలో చిరు పూరీతో గతంలో చేయాలనుకున్న ‘ఆటోజానీ’ గురించి కూడా చర్చించారు. ఆటోజానీ స్క్రిప్టు ఉందా, పక్కనబెట్టావా అని చిరు ప్రశ్నించగా.. లేదండీ.. ఆటోజానీ పక్కన పడేశాను.. అంతకు మించిన కథను రెడీ చేస్తానని పూరీ చెప్పుకొచ్చాడు.
Godfather: సల్లూ భాయ్ కోసం మెగాస్టార్ కాస్ట్లీ సర్ప్రైజ్.. ఏమిటో తెలుసా?
ఏదేమైనా తమ సంభాషణల మధ్య ఆటోజానీ సినిమా గురించి పూరీ, చిరులు ముచ్చటించడంతో మెగా ఫ్యాన్స్‌లో ఈ సినిమాపై మరోసారి ఆసక్తిని క్రియేట్ చేశారు. మరి చిరు కోసం పూరీ ఎలాంటి కథను రెడీ చేస్తాడా అని వారు ఆసక్తిగా చూస్తున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.