Puri Jagannadh : నేను బ్యాంకాక్ బీచ్ లో స్క్రిప్ట్ రాయను

పూరి జగన్ మాట్లాడుతూ.. అందరూ నేను బ్యాంకాక్ బీచ్ లో కూర్చొని స్క్రిప్ట్ రాస్తాను అనుకుంటారు. కాని అసలు బ్యాంకాక్‌లో స్క్రిప్ట్ రాయడమే చాలా కష్టం. అంత ఎంటర్‌టైన్‌మెంట్ ముందు........

Puri Jagannadh : నేను బ్యాంకాక్ బీచ్ లో స్క్రిప్ట్ రాయను

Puri

Updated On : January 17, 2022 / 9:12 AM IST

Puri Jagannadh :  డైరెక్టర్ పూరి జగన్నాధ్ బ్యాంకాక్ కి వెళ్లి స్క్రిప్ట్ రాస్తాడని అందరికి తెలుసు. తన సినిమాల్లో కొన్ని సన్నివేశాలు అయినా షూటింగ్ బ్యాంకాక్ లోనే జరుగుతాయి. ఈ విషయం పూరి జగన్నాధ్ చాలా సార్లు చెప్పాడు. బ్యాంకాక్ లో తనకు అభిమానులు ఉన్నారని, బ్యాంకాక్ లో తాను రాజకీయాల్లో పోటీ చేసినా గెలుస్తానని చాలా సార్లు తెలిపాడు పూరి జగన్. తనకి ఖాళీ దొరికితే కూడా బ్యాంకాక్ వెళ్లి సేద తీరుతాడు.

ఇటీవల ఆహాలో బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’కి గెస్ట్ గా వచ్చిన పూరి బ్యాంకాక్ లో స్క్రిప్ట్ రాయడం గురించి మరోసారి తెలిపారు. మీ ప్రతి సినిమా స్క్రిప్ట్ కోసం బ్యాంకాక్ వెళ్ళడానికి కారణమేంటి? అసలు ఏంటి ఈ బ్యాంకాక్ గోల? అని బాలకృష్ణ అడగగా..

Jayamma Panchayithi : రెండోసారి సింగర్‌గా మారిన యాంకర్ సుమ

పూరి జగన్ మాట్లాడుతూ.. అందరూ నేను బ్యాంకాక్ బీచ్ లో కూర్చొని స్క్రిప్ట్ రాస్తాను అనుకుంటారు. కాని అసలు బ్యాంకాక్‌లో స్క్రిప్ట్ రాయడమే చాలా కష్టం. అంత ఎంటర్‌టైన్‌మెంట్ ముందు నిబద్దతతో కూర్చొని స్క్రిప్ట్ రాయడం మామూలు విషయం కాదు. కాని అలాంటి ఏరియాస్ లోనే కష్టపడితే మన ఏకాగ్రత మన వర్క్ మీద ఎంత ఉందో తెలుస్తుంది. నేను పొద్దున్నే తొమ్మిది గంటలకు బీచ్‌కి వెళ్లి సాయంత్రం నాలుగు గంటలకు వస్తా. అప్పటిదాకా అక్కడ రిలాక్స్ అయి ఆ తర్వాతే రూమ్ కి వచ్చి స్క్రిప్ట్ పనులు చూసుకుంటాను. అంతే కాని నేను బ్యాంకాక్ బీచ్ లలో కూర్చొని స్క్రిప్ట్ రాయను” అని తెలిపారు.