Rashmika Mandanna : అరుదైన గౌరవం అందుకున్న రష్మిక..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. అరుదైన గౌరవం అందుకున్నారు. ఏంటో తెలుసా..?

Rashmika Mandanna : అరుదైన గౌరవం అందుకున్న రష్మిక..

Pushpa 2 heroine Rashmika Mandanna getting rare honour

Updated On : February 15, 2024 / 4:12 PM IST

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా మారిపోయింది. పుష్ప, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా హిట్స్ అందుకొని బ్లాక్ బస్టర్ హీరోయిన్ అనిపించుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఈమె చేతిలో రెండు పాన్ ఇండియా సినిమాలతో పాటు సౌత్ అండ్ నార్త్ లో కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. దీంతో రష్మిక పేరు టాలీవుడ్ టు బాలీవుడ్ రీ సౌండ్ వస్తుంది.

ఇక రీ సౌండ్.. రష్మికకు అరుదైన గౌరవం తెచ్చిపెట్టింది. వరల్డ్ టాప్ మ్యాగజైన్‌ ఫోర్బ్స్ ఇండియా వెర్షన్ లో రష్మిక.. ప్రత్యేక ఆర్టికల్ ని సంపాదించుకున్నారు. ఇండియాలో ప్రస్తుతం టాప్ పొజిషన్ కి ఎదుగుతున్న యువ వ్యాపారాలు, ఆవిష్కర్తలు, స్టార్స్ కి సంబంధించి ఫోర్బ్స్ ఇండియా ప్రత్యేక ఆర్టికల్ ని ప్రచురించింది. ఇక ఈ ఆర్టికల్ లో సినిమా ఇండస్ట్రీ నుంచి రష్మిక స్థానం దక్కించుకోవడం విశేషం.

Also read : Allu Arjun : బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి బయలుదేరిన బన్నీ.. పుష్ప స్క్రీనింగ్..?

ఇతర యంగ్ టాలెంట్స్ తో కలిసి కవర్ పేజీ పై స్టిల్ ఇచ్చిన తన ఫోటోని రష్మిక.. ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ పోస్టు చూసిన నెటిజెన్స్, అభిమానులు.. రష్మిక అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే ఫోర్బ్స్ ఇండియా ఆ ఆర్టికల్ లో రష్మిక గురించి ఏం రాసి ఉంటారని ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

కాగా రష్మిక సినిమాలు సంగతికి వస్తే.. అల్లు అర్జున్‌ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2లో నటిస్తున్నారు. ఇక అటు బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో ‘చావ’ అనే ప్రెస్టీజియస్ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. అలాగే తమిళంలో ధనుష్, శేఖర్ కముల కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్నారు. వీటితో పాటు రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్.. అనే రెండు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తున్నారు. సెట్స్ పై ఉన్న ఇవి కాకుండా, వీటితో పాటు యానిమల్ 2, స్పిరిట్ కూడా లైనప్ లో ఉన్నాయి.