Pushpa 2 : పుష్ప-2 షూటింగ్ అప్డేట్ వచ్చేసింది..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన సినిమా 'పుష్ప-1' ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలుసు. కాగా పార్ట్-1 విడుదలయ్యి ఏడాది గడుస్తున్నా 'పుష్ప ది రూల్' సెట్స్ పైకి వెళ్లకపోవడంతో బన్నీ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా...

Pushpa 2 : పుష్ప-2 షూటింగ్ అప్డేట్ వచ్చేసింది..

Pushpa 2 update is here

Updated On : December 11, 2022 / 5:18 PM IST

Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని పాన్ ఇండియా స్టార్‌గా మార్చేసిన సినిమా ‘పుష్ప-1’. టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం అనుకోని రీతిలో విజయాన్ని అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ రీజినల్ సినిమా, హద్దులు చెరిపేసి గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకుంది. ఇక రెండు భాగాలుగా చిత్రీకరణ జారుకుంటున్న ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Pushpa : రష్యాలో కూడా తగ్గేదేలే అంటున్న పుష్ప..

పార్ట్-1 విడుదలయ్యి ఏడాది గడుస్తున్నా.. ‘పుష్ప ది రూల్’ సెట్స్ పైకి వెళ్లకపోవడంతో బన్నీ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై అల్లు అర్జున్ స్నేహితుడు మరియు నిర్మాత ‘బన్నీ వాసు’ కీలక వ్యాఖ్యలు చేశాడు. నిఖిల్ ’18 పేజిస్’ సినిమా ప్రెస్ మీట్ లో బన్నీ వాసు మాట్లాడుతూ.. “రేపటి(సోమవారం) నుండి పుష్ప-2 షూటింగ్ మొదలు కానుంది” అంటూ వెల్లడించాడు.

ఇక ఈ వార్త విన్న బన్నీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన నటిస్తుంది. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అసలు అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న పుష్పరాజు.. రెండో భాగంతో ఎటువంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.