Pushpa : రష్యాలో కూడా తగ్గేదేలే అంటున్న పుష్ప..

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన సినిమా 'పుష్ప ది రైస్'. కాగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి వస్తున్న ఆదరణ చూసిన చిత్ర యూనిట్ రష్యాలో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే...

Pushpa : రష్యాలో కూడా తగ్గేదేలే అంటున్న పుష్ప..

Pushpa movie released in russia 774 screens

Pushpa : టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన సినిమా ‘పుష్ప ది రైస్’. గత ఏడాది డిసెంబర్ లో పాన్ ఇండియా వైడ్ విడుదలైన ఈ చిత్రం అనూహ్యమైన రీతిలో వరల్డ్ వైడ్ పాపులారిటీని సంపాదించుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ మ్యానరిజం మరియు డాన్సులకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది.

Pushpa Team In Russia: రష్యాలో సందడి చేస్తున్న ‘పుష్ప’ టీమ్

కాగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి వస్తున్న ఆదరణ చూసిన చిత్ర యూనిట్ రష్యాలో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 8న దాదాపు 774 స్క్రీన్ లో విడుదలయ్యి అక్కడ కూడా తగ్గేదేలే అంటుంది. ఇక విడుదలకు ముందే డిసెంబర్ 1, 3 తేదీల్లో ప్రీమియర్స్ వేయగా.. అల్లు అర్జున్, రష్మిక మందాన, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ హాజరయ్యి సందడి చేశారు.

ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ ‘పుష్ప ది రూల్’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొదటి భాగం వచ్చి ఏడాది అవుతున్న ఇప్పటి వరకు సెట్స్ పైకి పుష్ప 2 వెళ్లకపోవడంతో, సినిమా గురించి అప్డేట్ ఇవ్వాలంటూ గోల చేస్తున్నారు అభిమానులు. అయితే హీరోహీరోయిన్లకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్ర యూనిట్ ఆల్రెడీ తెరకెక్కించినట్లు తెలుస్తుంది. త్వరలోనే పుష్ప టీమ్ సింగపూర్ వెళ్లనుందట. అక్కడి అడవుల్లో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నారని తెలుస్తుంది.