Indravati : ‘ఊ అంటావా..’ సింగర్ కొత్త పాట.. అక్క మంగ్లీతో కలిసి ఆటాపాట
'గంధగిరి వనమాలి' పాట Promoను ఫుల్ సాంగ్ రిలీజ్ కు రెండు రోజుల ముందు రిలీజ్ చేశారు. ఈ ప్రోమో సాంగ్ కూడా బజ్ క్రియేట్ చేసింది.

Mangli Indra
Indravati : పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావ ఉఊ అంటావా..’ పాటతో పాపులరైన సింగర్ ఇంద్రావతి చౌహాన్. తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న వర్ధమాన జానపద, సినీ గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి చెల్లెలు ఈమె. ఇంద్రావతి చౌహాన్ ఆడి, పాడిన కొత్త జానపద పాట ఇపుడు యూట్యూబ్‌లో రిలీజైంది.
Read Also : Samantha : సమంత అరుదైన రికార్డ్.. టాప్ 100 గ్లోబల్ సాంగ్స్ లో నంబర్ 1గా ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’
చెల్లెలి పాటను తన అఫీషియల్ యూట్యూబ్ అకౌంట్ లో రిలీజ్ చేసింది మంగ్లీ. తన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో దీనిని ప్రమోట్ చేస్తోంది. దీంతో.. ఇంద్రావతి పాటకు ఇన్‌స్టంట్‌గా ప్రమోషన్ లభించినట్టయింది. ట్రెండ్, క్రేజ్ తోడవడంతో.. పాట వేగంగా ఆడియన్స్ ను రీచవుతోంది. పాట మధ్యలో మంగ్లీ కూడా తళుక్కుమన్నారు. అక్కాచెల్లెళ్లిద్దరూ తమవైన స్టెప్పులతో అలరించారు.
‘గంధగిరి వనమాలి’ పాట Promoను ఫుల్ సాంగ్ రిలీజ్ కు రెండు రోజుల ముందు రిలీజ్ చేశారు. ఈ ప్రోమో సాంగ్ కూడా బజ్ క్రియేట్ చేసింది. అక్కలాగే.. ఇంద్రావతి గొంతులోనూ మ్యాజిక్ ఉందని.. మరింత పాపులర్ అవుతుందని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలుపుతున్నారు.
‘గంధగిరి వనమాలి’ పాటను సదా చంద్ర రాసి ట్యూన్ చేశారు. మదీన్ ఎస్కే మ్యూజిక్ అందించారు. యూట్యూబ్ ఫేం జాను లిరి కొరియోగ్రఫీ అందించారు.
Read Also : Mangli – Indravati : ‘ఊ’పుతున్న అక్కాచెల్లెళ్ల ఐటం పాట.. అసలు స్పెషాలిటీ అదే..!