Adipurush : ఆదిపురుష్ దెబ్బతో పీవీఆర్ ఐనాక్స్ షేర్లు లాస్.. దాదాపు 3 శాతం పైగా..

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా నిన్న ఆడియన్స్ ముందుకు వచ్చి ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఇక ఈ సినిమా ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ లోని పీవీఆర్ ఐనాక్స్ షేర్ల పై ప్రభావ చూపించింది.

Adipurush : ఆదిపురుష్ దెబ్బతో పీవీఆర్ ఐనాక్స్ షేర్లు లాస్.. దాదాపు 3 శాతం పైగా..

PVR Inox Shares plunge down by Prabhas Adipurush talk

Adipurush – PVR Inox Share : రామాయణ కథాంశంతో రాముడిగా ప్ర‌భాస్‌(Prabhas), సీత‌గా కృతి స‌న‌న్(Kriti Sanon), రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) న‌టించిన సినిమా ఆదిపురుష్‌. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అంచనాలతో నిన్న (జూన్ 16) రిలీజ్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ దాదాపు 6200 థియేటర్స్ లో విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో విఫలం అయ్యింది.

Adipurush : ఆ రికార్డులో ఇండియాలోనే ఏకైక స్టార్ ప్రభాస్.. మూడు సినిమాలతో మొదటిరోజు!

సినీ నిర్మాణంలోని గ్రాఫిక్స్ తో పాటు రామాయణ పాత్రలను వక్రీకరించారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మూవీ పై భారీగా నెగటివిటీ వ్యాప్తి చెందుతుంది. ఇక ఈ నెగటివిటీ ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ (PVR Inox) షేర్ల పై ప్రభావ చూపించింది. దేశవ్యాప్తంగా ఉన్న పీవీఆర్ థియేటర్స్ లో ఆదిపురుష్ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో.. స్టాక్ మార్కెట్ లోని పీవీఆర్ షేర్ వాల్యూ దాదాపు 3.31 శాతం పడిపోయింది. మార్కెట్లు ప్రస్తుతం లాభాల్లో ఉన్న సమయంలో కూడా పీవీఆర్ షేర్లు పడిపోవడంతో ఆదిపురుష్ ఎఫెక్ట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Adipurush : నేపాల్‌లో ఆదిపురుష్ వివాదం.. డైలాగ్ తీసేయాలంటూ నేపాల్ నేతలు.. అసలు ఏమైంది?

కాగా ఈ సినిమా పై హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామాయణాన్ని అగౌరవపరిచేలా, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందంటూ కోర్టుని ఆశ్రయిస్తున్నారు. హిందూ సేన’ అధ్యక్షుడు విష్ణు గుప్తా.. వాల్మీకి రామాయణం మరియు తులసీదాస్ రామచరిత మానస్‌లోని పాత్రల వర్ణనకు ఆదిపురుష్ లో చూపించిన పాత్రలకు చాలా భిన్నంగా ఉన్నాయంటూ ఆదిపురుష్ మూవీ పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. మరోపక్క నేపాల్ నుంచి కూడా ఈ మూవీ పై అభ్యంతరం వ్యక్తం అవుతుంది.