Kantara : గవర్నమెంట్ ఎగ్జామ్‌లో కాంతారపై ప్రశ్న..
కన్నడ గ్రామదేవతల కథ ఆధారంగా మిస్టికల్ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం 'కాంతార'. కన్నడ నటుడు మరియు దర్శకుడు రిషబ్ శెట్టి నటిస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో సప్తమి గౌడ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా హవా కన్నడ పరిశ్రమ నుంచి బాలీవుడ్ పరిశ్రమ వరకు చేరుకోగా, తాజాగా కాంతార మ్యానియా విద్యారంగంలోనూ వ్యాపించింది.

Question on Kantara in Government Exam Paper
Kantara : కన్నడ గ్రామదేవతల కథ ఆధారంగా మిస్టికల్ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం ‘కాంతార’. కన్నడ నటుడు మరియు దర్శకుడు రిషబ్ శెట్టి నటిస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో సప్తమి గౌడ్ హీరోయిన్ గా నటించింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి కలెక్షన్స్ పరంగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 450 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
Kantara: హాలీవుడ్‌కి వెళ్తున్న కాంతార.. నిజమేనా?
ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకుల నుంచి స్టార్ హీరోల వరకు ఫిదా అయ్యిపోతున్నారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో రిషబ్ ట్రాన్స్‌ఫార్మేషన్ అందరికి గూస్‌బంప్స్ తెప్పించింది. కన్నడ సినీ పరిశ్రమలో ఈ మూవీ కేజిఎఫ్ తరువాత సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమా హవా కన్నడ పరిశ్రమ నుంచి బాలీవుడ్ పరిశ్రమ వరకు చేరుకోగా, తాజాగా కాంతార మ్యానియా విద్యారంగంలోనూ వ్యాపించింది.
ఈ చిత్రం కర్ణాటక గ్రామ ప్రాంతాల్లో నిర్వహించే భూతకోల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎగ్జామ్ పేపర్ లో.. ‘ఇటీవల విడుదలైన కాంతార సినిమా దేని ఆధారంగా తెరకెక్కింది’ అంటూ జల్లికట్టు, భూతకోల, యక్షగాన, దమ్మామి అని ఆప్షన్లు ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, హీరోయిన్ సప్తమి గౌడ్ ఆ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.