Raashii Khanna : బాహుబలి అవంతిక పాత్ర నేను చేయాల్సింది, కానీ రాజమౌళి.. రాశి ఖన్నా!
బాలీవుడ్ సినిమాతో యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టిన రాశి ఖన్నా సౌత్ లో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. ఇక ఇటీవల మళ్ళీ బాలీవుడ్ లో ఛాన్స్ లు అందుకుంటున్న ఈ భామ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాహుబలి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Raashii Khanna says she is the first choice for tamanna role in baahubali
Raashii Khanna : బాలీవుడ్ సినిమాతో యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టిన రాశి ఖన్నా సౌత్ లో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. ఇక ఇటీవల మళ్ళీ బాలీవుడ్ లో ఛాన్స్ లు అందుకుంటున్న ఈ భామ.. తాజాగా ‘ఫర్జి’ అనే వెబ్ సిరీస్ తో హిట్ అందుకుంది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో రాశి ఖన్నా బలమైన పాత్ర చేసి మెప్పించింది. దీంతో బాలీవుడ్ లో రాశి పేరు గట్టిగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈ భామ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాహుబలి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Raashii Khanna : షారుఖ్‌ని దాటి మరీ ఆ లిస్ట్‌లో టాప్ 1 గా నిలిచిన రాశీఖన్నా..
బాహుబలి సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన అవంతిక పాత్ర కోసం మొదట రాశి ఖన్నాని సంప్రదించారట. అందుకోసం రాశి ఆడిషన్ కూడా ఇచ్చిందట. కానీ రాశిని చూసిన రాజమౌళి.. ఆమె చాలా క్యూట్ గా ఉందని, మంచి లవ్ స్టోరీ క్యారెక్టర్ కి అయితే రాశి సెట్ అవుతుందని చెప్పాడట. అంతేకాదు రాజమౌళి ఫ్రెండ్ అయిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా ప్రొడ్యూసర్ కి రాశిని పరిచయం చేయించి ఆ సినిమాలో హీరోయిన్ గా సజెస్ట్ చేసాడట. అలా ఆ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైంది.
ఇక ఇప్పుడు ఈ వార్త తెలిసిన రాశి ఖన్నా అభిమానులు.. బాహుబలిలో రాశి చేసి ఉంటే ఆమె కెరీర్ ఇప్పుడు ఇంకో రేంజ్ లో ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రాశి ఖన్నా ప్రస్తుతం హిందీలో ‘యోధ’ అనే సినిమాలో నటిస్తుంది. సిద్దార్థ్ మల్హోత్రా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో దిశా పటాని కూడా మరో హీరోయిన్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం జులై నెలలో రిలీజ్ కి సిద్దమవుతుంది.