ముద్దులు కాదు బాబోయ్ – ఈ సినిమాలో ఒక స్వీట్ సర్‌ప్రైజ్ ఉంది

‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో తన పాత్ర గురించి వివరాలు చెప్పిన రాశీ ఖన్నా..

  • Published By: sekhar ,Published On : February 12, 2020 / 11:10 AM IST
ముద్దులు కాదు బాబోయ్ – ఈ సినిమాలో ఒక స్వీట్ సర్‌ప్రైజ్ ఉంది

Updated On : February 12, 2020 / 11:10 AM IST

‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో తన పాత్ర గురించి వివరాలు చెప్పిన రాశీ ఖన్నా..

‘వెంకీమామ’, ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలతో వరుసగా సూపర్ సక్సెస్‌ని అందుకుంది రాశిఖన్నా. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లో ఓ కీలక పాత్ర పోషించింది. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ. వల్లభ నిర్మించారు. విజయ్ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లెయితే నలుగురు హీరోయిన్లు నటించారు. వేలంటైన్స్ డే కానుకగా పిబ్ర‌వ‌రి 14న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుద‌ల‌వుతోంది. 
ఈ సంద‌ర్భంగా హీరోయిన్ రాశీ ఖన్నా మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలు..
ఛాలెంజింగ్ క్యారెక్టర్ !!
‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో నేను ఇప్పటి వరకు చేసిన చిత్రాలతో పోలిస్తే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ఆ విషయం ఇప్పటికే ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్ధం అయి ఉంటుంది. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఈ సినిమా కథ గురించి చెప్పాలి. అందుకే ఇది ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని మాత్రమే ఇప్పుడు చెప్పగలను. అలాగే టీజ‌ర్‌, ట్రైలర్ చూసి ఈ సినిమా కథ ఇది అయి ఉండొచ్చు అని చాలా రకాలుగా అనుకుంటున్నారు. అలాంటి వారందరికీ ఇదొక సర్‌ప్రైజ్‌లా ఉండబోతుంది.

wfl

నా రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండే పాత్ర!!
ఈ సినిమాలో నా పాత్ర పేరు యామిని. ప్రతి అమ్మాయిలోనూ ఒక యామిని ఉంటుంది అని నా ఫీలింగ్. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. నేను ఇప్పటివరకు ఏ క్యారెక్టర్‌తో రిలేట్ అవ్వలేదు. కానీ యామిని క్యారెక్టర్‌కి రిలేట్ అయ్యాను. నా రియల్ లైఫ్‌కి చాలా దగ్గరగా ఉండే పాత్ర. ఇది ఒక ఎమోషనల్ సినిమా కాబట్టి మేము కూడా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం.
ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ సైడ్ ఉంటుంది!!
నా దృష్టిలో అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ సైడ్ ఉంటుంది. అయితే ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉన్న అమ్మాయిలు మాత్రమే ఆ ఎమోషన్‌ని అందరి ముందూ చూపించుకోరు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కూడా ఇదే. ఆ క్యారెక్టర్‌కి అంతగా రిలేట్ అయ్యాను కాబట్టే కేవలం రెండు రోజుల్లోనే డబ్బింగ్ చెప్పగలిగాను.

wfl

విజయ్ ఒక న్యూ థీమ్‌ని ట్రై చేశాడు!!
రేపు సినిమా విడుదలయ్యాక ఈ మూవీకి ఈ టైటిల్ యాప్ట్ అని మీరే నమ్ముతారు. విజయ్ థియేటర్ బ్యాక్ గ్రౌడ్ నుండి వచ్చారు అని నాకు ముందు తెలీదు. ఈ సినిమా షూటింగ్‌లో ఒక సందర్భంలో తనే చెప్పారు. అందుకే విజయ్ ఏ ఎమోషన్‌ని అయినా ఈజీగా పలికించగలరు. తనతో వర్కింగ్ చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో విజయ్ ఒక న్యూ థీమ్‌ని ట్రై చేశాడు. ఎలాంటి సందర్భంలో అయినా విజయ్ అస్సలు భయపడరు. అందుకే ఆయన క్యారెక్టర్‌కి అందరూ కనెక్ట్ అవుతారు. రేపు రిలీజ్ తరువాత అందరూ ఈ సినిమా గురించే మాట్లాడతారు.
ఫాబ్యులెస్‌గా పెర్ఫామ్ చేసింది!!
ఈ క్యారెక్టర్ కాకుండా ఈ మూవీలో మరో పాత్ర చేసే అవకాశం ఉంటే తప్పకుండా ఐశ్వర్య రాజేష్ చేసిన క్యారెక్టర్ ఎంచుకునేదాన్ని. తను కూడా ఫాబ్యులెస్‌గా పెర్ఫామ్ చేసింది.

అద్భుతంగా తెరకెక్కించారు!!
క్రాంతి గారు ఈ సినిమా నరేట్ చేస్తున్నపుడు నేను వేరేలోకానికి వెళ్ళాను అనిపించింది. నేను చాలా ఎమోషనల్ పర్సన్‌కి కాబట్టి ఒకరకంగా చెప్పాలంటే ఏడ్చాను. అంతగా ఈ స్క్రిప్ట్‌తో కనెక్ట్ అయ్యాను. క్రాంతి గారు కూడా అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు.
వేలంటైన్ డే అంటే చాలా ఇష్టం!!
చాలా మందికి వేలంటైన్ డే అంటే ఇష్టం ఉండదు. కానీ నాకు చాలా ఇష్టం. ప్రస్తుతం తెలుగులో రెండు స్క్రిప్ట్స్ వింటున్నాను ఇంకా ఫైనల్ కాలేదు..

wfl