Raasi : నన్ను పెళ్లి కూతురు చేసిన తెల్లారే సౌందర్య మరణం.. సంతాప సభకు వెళ్లొద్దన్నారు.. రాశి ఎమోషనల్..
తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా సౌందర్య గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది రాశి. (Raasi)

Raasi
Raasi : సీనియర్ నటి రాశి ఒకప్పుడు మనల్ని హీరోయిన్ గా మెప్పించగా మధ్యలో సినిమాలకు దూరమైంది. ఇటీవలే మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా సౌందర్య గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. సౌందర్య, రాశి కలిసి పోస్ట్ మెన్, మూడు ముక్కలాట.. సినిమాల్లో నటించారు.(Raasi)
ఇంటర్వ్యూలో రాశి సౌందర్య గురించి మాట్లాడుతూ.. ఓ సారీ సౌందర్య స్టాఫ్ నా స్టాఫ్ తో మా మేడంని కొట్టేవాళ్ళు లేరు అనుకున్నాము, మీ మేడం వచ్చిందంటగా అని చెప్పారంట. నా స్టాఫ్ నాతో చెప్పారు. షూటింగ్స్ కి వస్తే ఒకే చోట రూమ్స్. ఆవిడది, నాది ఎదురెదురు రూమ్స్. నన్ను చెల్లి అనేది. ఆవిడ కంటే నేను చాలా చిన్నదాన్ని. ఆవిడ లేరు అని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను. నేను పెళ్ళికి పిలవాలని అనుకున్న ఒకే ఒక సినీ పరిశ్రమ వ్యక్తి ఆవిడే.
Also Read : Raasi : ఆంటీ అంటే ఎందుకు ఫీల్ అవ్వడం.. ఎందుకు ఏజ్ దాస్తారు.. వాళ్లకు రాశి కౌంటర్..?
నన్ను పెళ్లి కూతురు చేసిన నెక్స్ట్ డే ఆవిడకు అలా జరిగింది. సంతాప సభ పెట్టారు హైదరాబాద్ లో. నన్ను వెళ్లొద్దు అన్నారు ఇంట్లో. పెళ్లి కూతురు అయ్యాక బయటకు వెళ్లొద్దు అన్నారు. కానీ నేను వెళ్తాను బెంగుళూరు వెళ్లి ఎలాగో చూడలేను, చూడటానికి లేదు. కనీసం ఇక్కడ ఫోటో చూసి దండం పెట్టి వస్తాను అని వెళ్ళాను అని చెప్తూ ఎమోషనల్ అయింది.